Political News

ఇక‌.. స‌జ్జ‌ల సంగ‌తి: ఆక్ర‌మిత భూముల స్వాధీనం!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, గ‌త ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సంగ‌తి తేల్చేందుకు స‌ర్కారు సిద్ధ‌మైంది. క‌డ‌ప జిల్లా సీకే దిన్నెమండ‌లం ప‌రిధిలోని అట‌వీ భూముల్లో 55 ఎక‌రాల‌ను ఆక్ర‌మించి.. సజ్జ‌ల ఎస్టేట్‌ నిర్మించిన‌ట్టు ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొన్నాళ్ళ కింద‌టే తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. అప్ప‌ట్లోనే ఆ వ్య‌వ‌హారంపై విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ నియ‌మించిన రెవెన్యూ, అట‌వీ శాఖల అధికారుల‌ బృందం స‌జ్జ‌ల ఎస్టేట్‌లో ప‌ర్య‌టించి.. నిజానిజాలే తేల్చింది.

భూములు ఆక్రమించిన మాట వాస్త‌వ‌మేన‌ని అధికారుల బృందం నివేదిక స‌మ‌ర్పించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా స‌జ్జ‌ల ఆక్ర‌మిక భూమిని స్వాధీనం చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. దీంతో తాజాగా క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. గురువారం సంబంధిత భూముల‌ను స్వాధీనం చేసుకుని.. కంచె ఏర్పాటు చేయ‌డంతోపాటు.. హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్నారు. దీంతో గురువారం స‌జ్జ‌ల ఆక్ర‌మిత అట‌వీ భూమి 55 ఎక‌రాల‌ను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు రెడీ అయ్యారు.

ఇక్క‌డితో ఆగ‌దు!

ఇక‌, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆక్ర‌మ‌ణ‌ల వ్య‌వ‌హారం కేవలం స‌ద‌రు ఆక్ర‌మిక భూముల‌ను స్వాధీనం చేసుకోవ‌డంతోనే ఆగ‌బోద‌ని అధికారులు చెబుతున్నారు. దీని వెనుక అప్ప‌ట్లో ప‌నిచేసిన అధికారులు స‌హా.. అంద‌రి పైనా అట‌వీ శాఖ చ‌ట్టాల ప్ర‌కారం కేసు పెట్ట‌బోతున్న‌ట్టు తెలిపారు. అలానే స‌జ్జ‌ల కుటుంబ స‌భ్యుల‌పై కూడా.. కేసులు పెట్ట‌నున్న‌ట్టు చెప్పారు. ఆక్ర‌మిత భూమిలో ఉన్న చెట్ల‌ను న‌రికి వేయ‌డం.. అట‌వీ సంప‌ద‌కు న‌ష్టం క‌లిగించ‌డం పైనా ప‌రిహారం వ‌సూలు చేసే అవ‌కాశంతోపాటు కేసు న‌మోదు చేసి.. జైలుకు త‌ర‌లించే అవ‌కాశం కూడా ఉంద‌ని పేర్కొన్నారు. దీంతో స‌జ్జ‌ల సంగ‌తి తేల నుంచి అంటున్నారు.

This post was last modified on May 21, 2025 10:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

9 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

47 minutes ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

1 hour ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

5 hours ago