Political News

ఆ విషయంలో చంద్రబాబు పై లోకేశ్ కంప్లయింట్!

సీఎం చంద్రబాబు…ఈయనకు పని రాక్షసుడు అని అధికారుల దగ్గర పేరుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన నిద్రపోడు..అధికారులను నిద్ర పోనివ్వడు అని అధికార వర్గాల్లో టాక్ ఉంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పనిచేయడం..అధికారులతో పని చేయించడం చంద్రబాబు నైజం. అందుకే, ఆయన దేశంలోని మోస్ట్ సక్సెస్ ఫుల్ సీఎంలలో ఒకరిగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి చంద్రబాబు గురించి మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కనీసం ఒక్క సెకండ్ హ్యాపీనెస్ కూడా సీఎం చంద్రబాబు ఇవ్వరని లోకేశ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

సార్…డిపార్ట్ మెంట్ లో ఈ సంస్కరణలు తీసుకొచ్చాం..వాటి వల్ల ఈ రిజల్ట్స్ వచ్చాయి అని చెప్పగానే…చాలా సంతోషం..నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చంద్రబాబు అడుగుతారని లోకేశ్ చెప్పారు. కనీసం ఒక్క సెకన్ హ్యాపీనెస్ ఆయన మాకివ్వరని అన్నారు. చంద్రబాబు ఈ స్థాయికి వచ్చారంటే…ఆయనలో కసి, తపన కారణమని..ఎంత చేసినా పొంగిపోకూడదని, మరింత చేయాలనే తపన ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబును అడిగి మరీ విద్యా శాఖను తీసుకున్నానని లోకేశ్ చెప్పారు. ఆ శాఖ కఠినంగా ఉంటుంది, యూనియన్లు ఉంటాయి అని చంద్రబాబు వారించినా…ఛాలెంజ్ గా తీసుకొని ఈ శాఖ మంత్రిని అయ్యానని లోకేశ్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

లోకేశ్ కు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నారని, కానీ, తనకూ సవాళ్లు ఉంటాయని అన్నారు. 1984 తర్వాత టీడీపీ ఏనాడూ గెలవని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎన్నుకున్నానని, ఓడిపోయిన రెండో రోజు నుంచి మంగళగిరిలో రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేశానని అన్నారు. హార్డ్ వర్క్, విల్ పవర్ తో ఏదైనా సాధించవచ్చని విద్యార్థులను లోకేశ్ మోటివేట్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్ మామయ్యా అంటూ కృతకంగా విద్యార్థులతో పిలిపించుకున్న జగన్..ఏనాడైనా ఇలా లోకేశ్ లా మోటివేట్ చేశారా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పిల్లలకు లోకేశ్ మేనమామ అని..జగన్ కంస మామ అని కామెంట్లు చేస్తున్నారు.

This post was last modified on May 21, 2025 6:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago