సోనియా గాంధీ 142 కోట్లు నొక్కేశారు: ఈడీ సంచ‌ల‌న కామెంట్స్‌

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కురాలు, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియాగాంధీపై ఎన్ ఫోర్స్‌మెంటు డైరె క్ట‌రేట్‌(ఈడీ) సంచ‌ల‌న అభియోగాలు న‌మోదు చేసింది. వీటినే.. తాజాగా కోర్టుకు వెల్ల‌డించింది. నేష‌న‌ల్ హెరాల్డ్ కుంభ‌కోణంలో సోనియాగాంధీ ఒక్క‌రే రెండు విడ‌త‌లుగా 142 కోట్ల రూపాయ‌ల‌ను వెనుకేసుకున్నా ర‌ని ఈడీ ఆరోపించింది. దీనిలో 92 కోట్ల రూపాయ‌ల‌ను రాహుల్‌గాంధీ పేరిట నొక్కేశార‌ని(ఇలానే.. కిక్ ది మ‌నీ) వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఎవ‌రి ప‌ట్లా జాలి చూపించాల్సిన అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది.

నేషనల్ హెరాల్డ్‌ కేసును విచారిస్తున్న ఈడీ.. ఇటీవ‌ల చార్జిషీట్‌ను దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీనిలో తొలిసారి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల పేర్ల‌ను పేర్కొంది. ఇలా గాంధీల కుటుంబానికి చెందిన ఇద్ద‌రు అగ్ర నేత‌ల పేర్లు చార్జిషీట్‌లో కి ఎక్క‌డం ఇదే తొలిసారి. అది కూడా అవినీతి ఆరోప‌ణ‌ల‌తో కావ‌డం మ‌రింత సంచ‌ల‌నం. ఈ చార్జిషీట్‌పై ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు.

ఇవీ ఈడీ వాద‌న‌లు..

— రాహుల్‌, సోనియాగాంధీలు నేరపూరిత ఆస్తుల ద్వారా దాదాపు 142 కోట్లు పోగేసుకున్నారు.
— సోనియా, రాహుల్‌, శామ్‌పిట్రోడా(కాంగ్రెస్ నేత‌, విదేశాల్లో ఉన్నారు.) సుమన్‌ దూబే విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు.
— అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు రూ.50 లక్షలు చెల్లించడం ద్వారా, యంగ్ ఇండియన్ కంపెనీ రూ.90.25 కోట్లు సంపాదించింది.
— నేర పూరిత కుట్ర ద్వారా పోగేసుకున్న ఆదాయాన్ని రాజ‌కీయాల‌కు వినియోగించారు.
— నేష‌న‌ల్ హెరాల్డ్ స్థిరాస్థుల ద్వారా వచ్చిన రూ.142 కోట్ల ఆదాయాన్ని వాడుకున్నారు.
— ఈ సొమ్మును 14 శాతం వ‌డ్డీతో స‌హా వసూలు చేయాల్సి ఉంది.
— ఈ సొమ్ము లావాదేవీల‌ను మనీలాండరింగ్‌గా పరిగణించాలి.