ఏపీలో కలకలం రేపుతున్న మద్యం కుంభకోణం కేసు మంగళవారం మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటిదాకా ఈ కేసును రాష్ట్రంలోని కూటమి సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తుండగా… తాజాగా ఈ కేసు దర్యాప్తులోకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇదివరకే సిట్ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసినా… కోర్టుల నుంచి ఆ సంస్థకు ఈ కేసు దర్యాప్తునకు అనుమతి లభించలేదు. అయితే మంగళవారం ఈడీకి ఈ కేసు దర్యాప్తునకు కోర్టు అనుమతి లభించింది.
ఈ కేసులో ఏ1గా ఉన్న ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే ఈడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇదివరకే విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు తీర్పును మాత్రం వాయిదా వేసింది. తాజాగా మంగళవారం ఈ పిటిషన్ పై కోర్టు తన తీర్పును వెలువరించింది. కసిరెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఈడీ అధికారులకు అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు తన తీర్పులో చెప్పింది. వెరసి ఈ కేసు దర్యాప్తులో ఈడీకి తొలి అడుగు పడినట్టేని చెప్పక తప్పదు.
కేసుల దర్యాప్తులో ఇతర సంస్థల విధి విధానాలకూ.. ఈడీ విధి విధానాలకు పూర్తిగా వైరుధ్యం ఉంటుంది. రాష్ట్ర పోలీసులు, ఏసీబీ, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నమోదు చేసే కేసుల్లో ఆయా నిందితులపై మోపిన అభియోగాలను ఆయా దర్యాప్తు సంస్థలే రుజువు చేయాల్సి ఉంటుంది. ఆ రుజువులను కాచుకుంటూ సాగితే… నిందితులు బయట పడిపోవచ్చు. అయితే ఈడీ దర్యాప్తులో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నమనే చెప్పాలి. ఈడీ నమోదు చేసే కేసుల్లో నిందితులపై మోపే అభియోగాలు తప్పని నిందితులే నిరూపించుకోవాలి. అంటే… ఇతర దర్యాప్తు సంస్థలు అన్నింటికంటే ఈడీ దర్యాప్తు పూర్తి భిన్నమన్న మాట.
ఈ లెక్కన మద్యం కుంభకోణంలో కసిరెడ్డిపై గానీ, ఇతరత్రా నిందితులపై గానీ నమోదు అయిన అభియోగాలను ఈడీ అధికారులు నిరూపించాల్సిన పనే లేదు. ఆ అభియోగాలు తప్పని నిందితులే నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే.. తమ సత్యశీలతను నిందితులు తామే నిరూపించుకోవాలన్న మాట. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అని న్యాయ నిపుణులు చెబుతారు. ఆయా కేసులపై ఎంతో అనుభవం, ఈడీ చట్టాలపై మంచి పట్టున్న వారు మాత్రమే ఈ కేసుల్లో నుంచి బయటపడతారని చెబుతారు. ఈ లెక్కన మద్యం కుంభకోణం దర్యాప్తులోకి ఈడీ ఎంట్రీతో నిందితులందరికీ దబిడిదిబిడేనని చెప్పక తప్పదు.
This post was last modified on May 20, 2025 11:23 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…