Political News

నాకు మైండ్ బ్లాంక్ అవుతోంది: జ‌గ‌న్ షాకింగ్‌ కామెంట్స్‌

“ఏంట‌బ్బా ఈ కేసులు.. ఒక‌దాని త‌ర్వాత‌.. ఒక‌టా.? క‌నీసం బెయిల్ కూడా ద‌క్క‌కుండా చేస్తున్నారే. ఇవ‌న్నీ చూస్తుంటే.. నాకు మైండ్ బ్లాంక్ అవుతోంది. అయినా.. ధైర్యంగానే ఉందాం. ప్ర‌జ‌లే అన్నీ చూసుకుంటారు. బాబు పాపాలు పండిన‌ప్పుడు ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారు. మీరు ఎక్క‌డా నిరుత్సాహ ప‌డకండి. నాలాగే ధైర్యంగా ఉండండి` అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌హ‌జంగా జ‌గ‌న్ నుంచి నోటీ నుంచిమైండ్ బ్లాంక్‌` అనే మాట వ‌స్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌రు. అనేక స‌మ‌స్య‌లు వ‌చ్చినా.. ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌న్నా.. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టునిదానంగా వ్య‌వ‌హ‌రించ‌డం .. ఆయ‌న పేటెంట్ అని పార్టీ నాయ‌కులే చెబుతారు.

అలాంటిది తాజాగా జ‌గ‌న్‌.. త‌న మైండ్ బ్లాంక్ అవుతోందంటూ సంచ‌ల‌నం వ్యాఖ్య‌లు చేశారు. మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, స‌హా .. మ‌ద్యం కేసులో వ‌రుస పెట్టి జ‌రిగిన అరెస్టులు, జైళ్ల‌కు పంపడాల‌తో జ‌గ‌న్ ఒకింత షాక్‌కు గురైన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎవ‌రూ ఊహించ‌నివిధంగా కామెంట్లు చేశారని తెలుస్తోందని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. కాగా.. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీవీఎంసీ) కార్పొరేటర్లు, వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో జగన్‌ సమావేశం అయ్యారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ తొలుత పైవిధంగా వ్యాఖ్యానించారు. అనంత‌రం.. ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని టీడీపీ హయాంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. తమ హయాంలో ట్రైబల్ ప్రాంతాలను అభివృద్ధి చేశామని అన్నారు. టీడీపీ హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ లో భూసేకరణ జరగలేదన్నారు. వైస్సార్సీపీ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి జరగిందన్నారు. రాష్టంలోని అన్ని వ్యవస్థ లను చంద్రబాబు నిర్వీర్యం చేసారని మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. అయినా.. ధైర్యం కోల్పోకుండా.. పార్టీ కోసం ప‌నిచేయాల‌ని సూచించారు.

This post was last modified on May 20, 2025 11:11 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

58 minutes ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

2 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

5 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

5 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

6 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

8 hours ago