కొలికపూడి శ్రీనివాసరావు పేరు ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంది. మొన్నటిదాకా రాజకీయాలతో పెద్దగా సంబంధం లేనట్టుగా సాగిన కొలికపూడి… అమరావతి పరిరక్షణ ఉద్యమంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. టీడీపీలో క్రియాశీల నేతగా ఎదిగారు. 2024లో తిరువూరు టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా..అసలు సమస్య అక్కడి నుంచే మొదలైంది. తన నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోలేక నానా తిప్పలు పడుతున్న ఆయన తాజాగా… స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దాదాపుగా చతికిలబడిపోయారు.
తిరువూరు మునిసిపాలిటీని గతంలో వైసీపీ చేజిక్కించుకోగా… 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత పరిస్థితి అంతా మారిపోయింది. రాష్ట్రంలోని మెజారిటీ స్థానిక సంస్థలు కూటమి ఖాతాలో పడిపోతున్నాయి. ఈ క్రమంలో తిరువూరు మునిసిపాలిటీని కూడా కూటమి తన ఖాతాలో వేసుకునేందుకు రంగంలోకి దిగింది. లోకల్ ఎమ్మెల్యేగా కొలికపూడినే ఆ బాధ్యత తన భుజానికెత్తుకున్నారు. అయితే రాజకీయాల్లో అవసరమైన వ్యూహాలను రచించి అమలు చేయడంలో మాత్రం ఆయన విఫలమయ్యారు. వరుసగా సోమ, మంగళవారాల్లో తిరువూరు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక కోసం అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినా… ఎమ్మెల్యే తన చతురతను మాత్రం చాటలేకపోయారు.
వాస్తవానికి కొలికపూడికి టీడీపీ అధిష్ఠానం వద్ద మంచి వెయిటే ఉంది. ఆయా అంశాలపై సమగ్ర పట్టు కలిగిన విద్యా వంతుడిగా, ఏ వియంపై అయినా అనర్గళంగా మాట్లాడే పట్టు కలిగిన నేతగా కొలికపూడికి మంచి పేరుంది. టీవీ డీబేట్లలో ఈ విషయం నిరూపితమైంది కూడా. రాజకీయాల్లోకి ప్రత్యక్ష ఎంట్రీ తర్వాత ఎందుకనో గానీ… తనదైన రూట్ ఎంచుకున్న కొలికపూడి నియోజకవర్గంలోని పార్టీకి చెందిన కీలక నేతలతో సఖ్యతగా మెలగలేకపోయారు. సఖ్యత మాట అటుంచితే వారితో మనస్పర్థలు లేకుండా సాగలేకపోయారు. ఈ క్రమంలో కొలికపూడిపై నేరుగా అధిష్ఠానానికే రెండు, మూడు సార్లు ఫిర్యాదులు వెళ్లగా పార్టీ అధినాయకత్వం మందలించింది కూడా. తాజాగా మునిసిపాలిటీపై పట్టు సాధించడంలోనూ విఫలమైన కొలికపూడి తన రాజకీయ భవిష్యత్తును మరింత ప్రమాదంలో పడేసుకున్నారని చెప్పాలి.
This post was last modified on May 20, 2025 10:59 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…