గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ అంటేనే… సీనియర్లు, జూనియర్ల మధ్య నిత్యం ఆధిపత్య యుద్ధం నడుస్తూనే ఉంటుంది.ఈ తరహా విభేదాలు పార్టీకి పెద్దగా నష్టం చేయకున్నా… పార్టీకి చెందిన పలువురు కీలక నేతలకు మాత్రం అప్పటికప్పుడు ఊహించని షాకులు ఇస్తూ ఉంటాయి. ఈ తరహా పరిణామాలపై అసలు ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాక ఆయా కీలక స్తానాల్లో ఉన్న నేతలు తలలు పట్టుకుంటున్న దాఖలాలు కోకొల్లలు.
అలాంటి ఘటన శుక్రవారం తెలంగాణలోని జగిత్యాలలో చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన, రైతులతో మాట్లాడేందుకు శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జగిత్యాల వచ్చారు. జగిత్యాల లోకల్ లీడర్ గా పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇప్పటికే తనకేమీ ప్రాధాన్యం దక్కడం లేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్న సంగతి తెలిసిందే. తనలొని అసంతృప్తిని ఎప్పటికప్పుడు ఆయన వెలిబుచ్చుతూనే ఉన్నారు. శుక్రవారం పొంగులేటి వద్ద కూడా ఆయన తన నిరసన వైఖరిని కొనసాగించారు.
ఈ సందర్భంగా ఏం జరిగిందంటే… జగిత్యాల వచ్చిన పొంగులేటి అక్కడి సీనియర్ నేత అన్న భావనతో జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకునేందుకు ముందుకు కదిలారు. జీవన్ రెడ్డి భుజాలను పట్టుకుని ఆలింగనం చేసుకునేలోపే జీవన్ రెడ్డి.. పొంగులేటికి నమస్తే పెడుతూ వెనక్కు జరిగారు. దీంతో పొంగులేటి షాక్ తిన్నారు. పక్కనే ఉన్న యువ నేత వైపు ఓ లుక్కు విసిరిన పొంగులేటి ఇదేం పద్దతి బాసూ అన్నట్టుగా హూంకరించారు. మాకో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తే చాలంటూ జీవన్ రెడ్డి చెప్పగా… పొంగులేటి నమస్కారం చేశారు.
అక్కడితోనే కథ ముగియలేదు. తన ఆలింగనాన్నే వద్దని దూరం జరిగిన జీవన్ రెడ్డిని ఏమీ అనలేక… ఏమనాలో తెలియక పొంగులేటి అలా బ్లాంక్ ఫేస్ పెట్టగా…ఆయనను మరింతగా ఉడికించేలా అంతే కదా బాబూ అంటూ జీవన్ రెడ్డి ఓ కామెంట్ చేశారు. ఈ కామెంట్ కు నవ్వలేక నవ్వుతూ మరోమారు జీవన్ రెడ్డికి నమస్కారం పెట్టేసి పొంగులేటి వెళ్లారు. పొంగులేటి అలా వెళ్లగానే…ఇక మీరు చూసుకోండి.. మా పని అయిపోయింది. ఇక రాజ్యం ఏలండి అంటూ జీవన్ రెడ్డి రన్నింగ్ కామెంట్రీ చేశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
This post was last modified on May 17, 2025 12:21 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…