ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మొన్నటిదాకా కొనసాగిన నాన్ లోకల్ కోటాను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లోని సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు 15 శాతం సీట్లను నాన్ లోకల్ కోటాకు కేటాయిస్తూ వస్తున్న విధానానికి ఏపీ సర్కారు చరమ గీతం పాడేసింది. ఇప్పటిదాకా 85 శాతం సీట్లతోనే సరిపెట్టుకుంటున్న ఏపీ విద్యార్థులు ఇకపై వంద శాతం సీట్లను పొందే అవకాశాన్ని చేజిక్కించుకుంటారు.
తెలుగు నేల విభజన తర్వాత హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన ఏపీ పునర్విభజన విభజన చట్టం… అటు తెలంగాణతో పాటు ఇటు ఏపీలోని విద్యా సంస్థల్లో 15 శాతం చొప్పున సీట్లను పొరుగు రాష్ట్ర విద్యార్థులకు కేటాయించాలని, ఈ విధానాన్ని పదేళ్ల పాటు పాటించాలని సూచించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీతో పాటు తెలంగాణ కూడా గడచిన పదేళ్ల పాటు ఈ నాన్ లోకల్ కోటాను అమలు చేస్తూ వచ్చాయి. అయితే పునర్విభజన చట్టం నిర్దేశించిన పదేళ్ల కాల పరిమితి గతేడాది జూన్ 2తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఇటీవలే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాన్ లోకల్ కోటాను రద్దు చేసేసింది.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆ రాష్ట్రంలోని సీట్లన్నీ తెలంగాణ విద్యార్తులకే చెందుతాయి. అదే మాదిరిగా ఏపీ కూడా తన పరిదిలోని సీట్లన్నీ కూడా తన విద్యార్థులకే దక్కేలా పకడ్బందీ చర్యలు చేపట్టింది. మొన్నటి దాకా నాన్ లోకల్ కోటా అంటే.. పొరుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు కేటాయించాల్సిన సీట్ల శాతంగా పరిగణిస్తే… ఇప్పుడు కూడా ఏపీలో నాన్ లోకల్ కోటా అమలు అవుతుంది. అయితే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల విద్యార్థులను రాయలసీమకు నాన్ లోకల్ గా పరిగణిస్తే… సీమ విద్యార్థులను ఆంధ్రా వర్సిటీకి నాన్ లోకల్ గా పరిగణిస్తారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు మాత్రం ఈ నాన్ లోకల్ కోటాను అనుమతించరు.
This post was last modified on May 17, 2025 10:19 am
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…