Political News

ఉగ్రవాదాన్ని దెబ్బకొట్టేలా భారత్ చురుకైన ప్లాన్

పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదంపై కఠినంగా దూసుకెళుతున్న భారత్‌ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కూడా తన దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఆపరేషన్ సిందూర్ విజయంతో భారత్ తన సంకల్పాన్ని నిరూపించుకున్న తరుణంలో, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న భారత్‌ ఉద్దేశాన్ని ప్రపంచ దేశాలకు స్పష్టంగా వెల్లడించేందుకు కేంద్రం గట్టిగా కదులుతోంది.

ఇప్పటికే ఆస్ట్రియా విదేశాంగ మంత్రి బీట్ మెయిన్ల్-రైసింగర్‌తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన జైశంకర్, ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన కీలక సమాచారం అందించారు. పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలపై దాడులకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరించారు. ఉగ్రవాదానికి చరమగీతం పాడే సమయంలో భారత్ వెనక్కి తగలదని, అందుకే అంతర్జాతీయ మద్దతు అవసరమని స్పష్టం చేశారు. ఈ చర్చలో అణ్వస్త్రాల అంశం, భద్రతాపరమైన బెదిరింపులపై కూడా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అంతేకాక, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తో కూడా జైశంకర్ మాట్లాడారు. పాకిస్థాన్ నుంచి భారత్‌కు ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఆపరేషన్ సిందూర్‌ గురించి, దాని నేపథ్యం, లక్ష్యాలు, విజయాలు ఇలా మొత్తం వివరించారు. భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా ఉండాలని కోరారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ స్థాయిలో సమన్విత చర్యలు అవసరమన్న దృష్టితో ఇది జరగడం గమనార్హం.

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ విదేశాంగ శాఖ దాదాపు 70 దేశాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు జరిపింది. అమెరికా, రష్యా, జపాన్, యూకే వంటి దేశాలకు భారత్ ఉగ్రవాదంపై స్పష్టమైన సమాచారం ఇచ్చింది. పాకిస్థాన్ ఉగ్రవాద నెట్‌వర్క్‌కి అడ్డుకట్ట వేయాల్సిన అవసరాన్ని ప్రపంచం మొత్తం ముందుకు తీసుకురావడం ద్వారా భారత్ ఈ దౌత్యపరమైన యుద్ధాన్ని కొనసాగిస్తోంది.

This post was last modified on May 15, 2025 11:02 am

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

45 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago