కాశ్మీర్ కోసం దశాబ్దాలుగా భారత్‌పై దొంగదారిలో విరుచుకుపడుతూ, ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు చుట్టు పక్కల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. కాశ్మీర్ కావాలని పాకిస్థాన్ ఎంతగా ప్రయత్నించినా, ఇప్పుడు తనే ఆక్రమించి ఉన్న బలూచిస్థాన్‌ను చేజార్చుకునే పరిస్థితి తెచ్చుకుంది. స్వతంత్ర బలూచిస్థాన్ కోసం పోరాటం చేస్తున్న నేతలు, ప్రజలు బహిరంగంగానే తమ వాయిస్ వినిపిస్తూ ‘పాకిస్థాన్ మాకు అవసరం లేదు’ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి ఈ మాటలకు నిదర్శనం.
తాజాగా బలూచ్ ప్రతినిధి మీర్ యార్ బలోచ్ చేసిన ప్రకటన పాకిస్థాన్‌కు మరో షాక్‌లాంటిది. “మేము పాకిస్థానీయులు కాదంటూ” ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. కొన్నేళ్లుగా పాక్ దుర్మార్గాలను భరించిన బలూచ్ జనతా ఇప్పుడు మౌనంగా ఉండే పరిస్థితిలో లేరు. భారత్ పీవోకేపై చర్యలు తీసుకునే సమయంలోనే బలూచిస్థాన్ నుంచి వచ్చిన స్వరాలు పాక్‌ను అర్థరాత్రి నిద్రలేపేలా ఉన్నాయి.
ఇక పాక్‌కు నిజంగా మిత్ర దేశాలే మిగిలేనా అనే సందేహం కూడా వినిపిస్తోంది. ఉగ్రవాదంపై మద్దతు నిలిపి పెట్టమన్న ప్రపంచ దేశాల మాటకు చెవిచెయ్యని ఇస్లామాబాద్, ఇప్పుడు తాను ఆక్రమించిన భూభాగాన్నే పోగొట్టుకునే పరిస్థితిలోకి వచ్చిందంటే ఇదే కర్మ ఫలితమే అనుకోవాలనే కామెంట్స్ వస్తున్నాయి. సొంత రాష్ట్రమే చెబుతోందంటే, పాక్‌కు మరెవరి బలం పనికిరాదని స్పష్టమవుతోంది. అసలే బలూచిస్థాన్ నుంచే పాక్ కు ఆదాయం వనరులు సమకూరుతున్నాయి. గోల్డ్, బొగ్గు, గ్యాస్ లాంటి ఖనిజ వనరులు ఆ ప్రాంతంలో ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి బలూచిస్థాన్ చేజారింది అంటే పాక్ సర్దుకోవాల్సిందే.
This post was last modified on May 15, 2025 11:19 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…