పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా బుధవారం స్వదేశానికి సురక్షితంగా తిరిగొచ్చారు. గత నెల 23న పొరపాటున అంతర్జాతీయ రేఖను దాటి పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించిన ఆయన అక్కడి రేంజర్లకు చిక్కారు. దాంతో 3 వారాల పాటు పాక్ కస్టడీలో ఉండాల్సి వచ్చింది. చివరికి బీఎస్ఎఫ్, పాక్ రేంజర్ల మధ్య జరిగిన చర్చల అనంతరం అతన్ని అట్టారీ చెక్ పోస్ట్ వద్ద భారత్‌కు అప్పగించారు.
బీఎస్ఎఫ్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ ఉదయం సుమారు 10:30 గంటలకు అట్టారీ జాయింట్ చెక్ పోస్ట్ వద్ద పూర్ణం కుమార్‌ను అప్పగింపు ప్రక్రియ చేపట్టారు. అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం, శాంతియుతంగా ఈ మార్పిడి పూర్తి అయిందని అధికారులు తెలిపారు. పూర్ణం కుమార్‌ను బీఎస్ఎఫ్ వైద్య బృందం పరిశీలించిన అనంతరం ఆయన్ను తన విధి ప్రాంతానికి తరలించినట్టు సమాచారం.
పూర్ణం కుమార్ షా ప్రస్తుతం ఫిరోజ్‌పూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 23న నిబంధనలు పాటించకుండానే ఆయన పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించారని పాక్ ఆరోపించింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బీఎస్ఎఫ్, పాక్ రేంజర్లు పరస్పరం సంప్రదించి విడిపోతారు. కానీ ఈసారి పరిస్థితి విభిన్నంగా ఉండటంతో ఆయన విడుదల ఆలస్యం అయింది.
కారణం ఏంటంటే, అప్పటి రోజుల్లో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉండేవి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మృతి చెందారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అధికమయ్యాయి. పాక్ ఈ వ్యవహారాన్ని స్వల్పకాలిక రాజకీయ లబ్దికి ఉపయోగించుకునే అవకాశం ఉందని అంచనాలు ఉండటంతో జవాన్ విడుదల ఆలస్యమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పూర్ణం కుమార్ సురక్షితంగా తిరిగొచ్చిన నేపథ్యంలో బీఎస్ఎఫ్ అధికారులతో పాటు కుటుంబసభ్యులు, సహచరులు ఆనందం వ్యక్తం చేశారు.
This post was last modified on May 14, 2025 1:08 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…