Political News

అయితే అతి.. లేక‌పోతే సైలెంట్‌.. ఈ ఎమ్మెల్యే ఇంతే.. !

అయితే.. అతి చేయ‌డం, లేక‌పోతే సైలెంట్ అయిపోవ‌డం.. కొంద‌రు ఎమ్మెల్యేల వ్య‌వ‌హారంగా మారింది. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌లు ప‌ట్టించుకునే నాథుడు లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్ష నాయ‌కుల ను ఆశ్ర‌యిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు తిరువూరు, స‌త్య‌వేడు, క‌డ‌ప స‌హా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. అయితే.. ఈ ఎమ్మెల్యేలు ఉంటే దూకుడుగా లేక‌పోతే.. మౌనంగా ఉంటున్నారు.

తిరువూరు ఎమ్మెల్యే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న వివాదాల‌కు కేరాఫ్‌గా మారారు. అధిష్టానం హెచ్చ‌రించ‌డంతో పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న మ‌కాంను కూడా హైద‌రాబాద్‌కు మార్చేసుకున్నార‌ని తెలిసింది. ఇక‌, క‌డ‌పలోనూ ఎమ్మెల్యే మాధ‌వీరెడ్డి దూకుడుగా ఉన్న విష‌యం తెలిసిందే. త‌న సొంత పార్టీ నాయ‌కుల‌పైనా ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించి వివాదాలు తెచ్చుకున్నారు. దీంతో కొన్ని రోజుల కింద‌ట నారా లోకేష్ హెచ్చ‌రించారు. దీంతో ఆమె సైలెంట్ అయిపోయారు.

ఇక‌, స‌త్య‌వేడు ఎమ్మెల్యే తీరు వేరేగా ఉంది. ఆయన‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చిన త‌ర్వాత‌.. కేసు న‌మోదైంది. మొత్తంగా ఆయన ఆ కేసు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. కానీ, నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా చెన్నై, బెంగ‌ళూరుకు ప‌రిమితం అయ్యారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప్ర‌జ‌ల‌కు ఎమ్మెల్యే దూర‌మై మ‌య్యార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న కుమారుడు చ‌క్రం తిప్పుతున్నా.. ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ప‌ట్టించు కోవ‌డం లేదు.

ఈ నియోజ‌క‌వ‌ర్గాలు పైకి క‌నిపిస్తున్నా.. ఇంకా చాలా వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు దూకుడుగా ఉండడం.. అదిష్టానం హెచ్చ‌రించ‌డంతో మౌనంగా ఉండిపోవ‌డం కామ‌న్ అయింది. ఇలా చేయ‌డం వ‌ల్ల ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అయింది. తిరువూరు, స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గాలు ఎస్సీ సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వ్ చేయడంతో ఇక్క‌డివారంతా వైసీపీ నాయ‌కుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. స‌త్య‌వేడులో అయితే.. తిరుప‌తి ఎంపీ హ‌వా కొన‌సాగుతోంది. సో.. అలా కాకుండా.. నాయ‌కులు ఆలోచించి అడుగులు వేస్తే..ఈ స‌మ‌స్య‌లు వ‌చ్చేవి కావ‌న్న‌ది ప‌రిశీల‌కుల అంచ‌నా.

This post was last modified on May 19, 2025 9:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago