వైసీపీ నాయకులపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు పడ్డాయి. జైలు-బెయిలు అంటూ.. నాయకులు, అప్పట్లో వైసీపీకి అనుకూలంగా పనిచేశారని చెప్పుకొనే ఐపీఎస్ అధికారు లు కూడా కేసులు ఎదుర్కొంటున్నారు. పీఎస్ ఆర్ ఆంజనేయులు ఏకంగా జైలు జీవితం గడుపుతున్నారు. ఇంకా మరికొందరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. వారి ప్రొఫైల్‌తో సంబంధం లేకుండా. వైసీపీ హయాంలో చేసిన పనులే శాపంగా పరిణమించాయి.
ఇక, నాయకుల పరిస్థితి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వారు కూడా బెయిల్ దక్కక చిక్కులు పడుతు న్నారు. అయితే.. ఈ విషయాలన్నీ.. తాజాగా జగన్ నిర్వహించిన పార్టీ సమావేశంలో చర్చకు వచ్చాయి. జగనే ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘ఈ విషయం అప్పుడే చెప్పా’ అంటూ.. జగన్ చెప్పుకొచ్చారు. పార్టీ మళ్లీ అధికారంలోకి రాకపోవడంతోనే ఇలా జరిగిందని.. కేసులు పెడతారని తాను ఇదివరకే చెప్పానని జగన్ ముక్తాయించారు.
“మనం అన్నీ మంచిగానే చేశాం. అయినా.. మనపై రాజకీయం జరుగుతోంది. ఈ విషయాన్ని ఎన్నికలకు ముందే నేను చెప్పా. పార్టీ గెలుపుకోసం కష్టపడి పనిచేయాలని చెప్పా. కానీ.. జరిగిపోయింది. ఇప్పటికైనా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పనిచేయాలి. మనమే అధికారంలోకి వస్తాం.. అని నేను చెబుతున్నా.. మీరు కూడా ఆదిశగా అడుగులు వేయాలి. వచ్చే ఎన్నికల్లో అయినా.. మనం అధికారంలోకి వచ్చి తీరాలి. అప్పటి వరకు కేసులు తప్పవు.” అని జగన్ చెప్పుకొచ్చారు.
అయితే.. అధికారంలోకి వచ్చినా.. రాకున్నా.. కొన్ని కేసులు మాత్రం జగన్‌ను వెంటాడుతున్నాయి. కానీ.. పార్టీ నాయకులకు కొంత ఊరట లభించి ఉండేది. వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే.. ఆయన చెప్పినట్టు ఇబ్బందులు ఉండేవి కాకపోయినా.. అధికారంలోకి వచ్చే పరిస్థితిని మాత్రం నాయకులు చేజేతులా పాడుచేసుకున్నారన్నది వాస్తవం. ప్రజలకు చేరువ కాకపోవడం.. వారిపైనే దూషణలకు దిగడం(జీడీ నెల్లూరులో ఇదే జరిగింది) వంటివి వైసీపీని ప్రజలకు దూరం చేశాయి. ఈ విషయాన్ని గుర్తించి.. ఉంటే ఇప్పటికైనా వైసీపీకి మంచిరోజులు వస్తాయని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on May 12, 2025 11:42 am
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…