Political News

నా సిందూరాన్ని దేశ రక్షణకు పంపిస్తున్నా: నవవధువు

మహారాష్ట్ర జల్గావ్ జిల్లా పచోరా తాలూకా పుంగావ్ గ్రామానికి చెందిన జవాన్ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ వివాహం మే 5న కలాంసర గ్రామానికి చెందిన యామినితో ఘనంగా జరిగింది. సాధారణంగా పెళ్లి అనంతరం ఒక కొత్త జంట కలిసిన ప్రతి క్షణం ఆనందాన్ని పంచుకుంటూ గడపాలి. కానీ ఈ జంటకు అది సాధ్యం కాలేదు. పెళ్లైన మూడో రోజే పాటిల్‌కు ఆర్మీ నుంచి అత్యవసర పిలుపు రావడంతో, తక్షణం విధుల కోసం బార్డర్‌కి వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఈ విరహానికి కారణం దేశంలో తారాస్థాయికి చేరిన ఉద్రిక్తతలు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో సైన్యంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు అత్యంత కీలకంగా మారారు. అప్పుడు వ్యక్తిగత జీవితం కాదు… దేశం కోసం పోరాడాలి అనే కసితో ఉన్నారు జవాన్లు. ఈ సమయంలో పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టిన జవాన్ పాటిల్ కూడా ‘దేశం మొదట’ అనే అర్జెంటు పిలుపుకి స్పందించాల్సి వచ్చింది.

పచోరా రైల్వే స్టేషన్‌లో జవాన్ పాటిల్‌కు ఇచ్చిన వీడ్కోలు దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నూతన వధువు యామిని “నా సిందూరాన్ని దేశ రక్షణకు పంపిస్తున్నా” అని చెప్పిన మాటలు ఎందరో హృదయాలను తాకాయి. ఆమె కన్నీటిని కళ్ళల్లోనే నిలిపి భర్తను గర్వంగా వీడ్కోలు చెప్పిన తీరుతో పలు వర్గాల ప్రజలు అద్భుతమైన ధైర్యానికి, త్యాగానికి శిరసు వంచుతున్నారు.

మనోజ్ పాటిల్ లాంటి జవాన్‌లు, యామిని లాంటి జీవిత భాగస్వాములు దేశానికి నిజమైన శక్తి. వీరి త్యాగాలను గౌరవించడం మాత్రమే కాదు, వీరి కుటుంబాలకు మానసిక, సామాజిక మద్దతు కల్పించడం కూడా సమాజం బాధ్యతగా గుర్తించాలి. ప్రతి వీరుడు వెనుక ఒక ధైర్యమైన గుండె ఉంటుంది… అది మరువకూడదు.

This post was last modified on May 10, 2025 2:40 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

14 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago