జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిజంగానే ఏది చేసినా ప్రత్యేకమే. సినిమాల్లో స్టెప్పులేసినా…అదిరేటి డైలాగులు చెప్పినా..డూప్ లు లేకుండా స్టంట్ లలో పాల్గొన్నా… ఇలా ఏ విషయం తీసుకున్నా పవన్ ది ఓ ప్రత్యేక రేంజే. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే… పవన్ ను మించిన హీరో లేరంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రత్యేక శైలిని పవన్ కొనసాగిస్తున్నారు. ఏ పని చేసినా ఇతర నేతలకు విభిన్నంగా సాగుతున్న పవన్.. ఆయా పనులను తనదైన శైలిలో పూర్తి చేస్తూ ప్రజాదరణలో దూసుకుపోతున్నారు.
ఇలాంటి క్రమంలో శుక్రవారం మంగళగిరిలోని పవన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ చిన్నవేడుకకు సంబంధించిన ఫొటోలను చూస్తుంటే… నిజంగానే ఈ తరహా ఆతిధ్యం గానీ, ఆప్యాయతను గానీ, పవన్ ఆతిథ్యాన్ని స్వీకరించిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలు ముఖంలో కనిపించిన తృప్తిని గానీ ఇప్పటిదాకా ఎప్పుడూ చూడలేదు. తన కోసం వేసుకున్న నులక మంచం మీద పేరంటాలును కూర్చోబెట్టుకుని స్వయంగా ఆమెకు వడ్డించి తాను వడ్డించుకుని… పేరంటాలుకు కొసరికొసరి వడ్డించి మరీ ఆమె కడుపు నింపిన పవన్ ఆ తర్వాత ఆమెకు చీర, రూ.1 లక్ష నగదు ఇచ్చి… బయటకు వెళ్లి వీడ్కోలు పలికిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ చేత ఇంతటి ఆతిథ్యం, ఆప్యాయతను పొందిన పేరంటాలు ఎవరు?… ఆ కథాకమామీషు ఏమిటన్న వివరాల్లోకి వెళితే… మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేసి బంపర్ మెజారిటీతో విజయం సాదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ గెలవాలని పిఠాపురం పరిధిలోని యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన పేరంటాలు తన కుల దైవం అయిన వేగులమ్మ తల్లికి ప్రత్యేకంగా మొక్కుకున్నారట. పవన్ ను గెలిపిస్తే..పొర్లు దండాలతో పాటుగా అమ్మవారికి గరగ చేయిస్తానని మొక్కుకున్నారట.
పేరంటాలు మొక్కు బలమో, ఇంకేమిటో తెలియదు గానీ… పిఠాపురం నుంచి పవన్ బంపర్ మెజారిటీతో గెలిచారు. ఏకంగా డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ఈ క్రమంలో మొక్కు తీర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్న పేరంటాలు.. తనకు వచ్చే వృద్ధాప్య పింఛన్ లో నుంచి ప్రతి నెల రూ.2,500 పక్కనపెట్టి.. మొత్తం రూ.27 వేలు కూడబెట్టి… దానితో అమ్మవారికి గరగ చేయించారు. ఈ విషయం తెలిసిన పవన్ పేరంటాలు గురించి ఆరా తీయగా.. పవన్ తో కలిసి భోజనం చేయాలని ఉందని తెలిపారట. తన విజయం కోసం 96 ఏళ్ల వయసున్న వృద్ధురాలు పొర్లు దండాలు, పింఛన్ డబ్బులతో అమ్మవారికి గరగ చేయించిన తీరుతో అప్పటికే ఆశ్చర్యానికి గురైన పవన్… ఆమెను తన. వద్దకు పిలిచి మరీ జీవితంలో మరిచిపోలేని ఆతిథ్యం ఇచ్చి… అంతకుమించిన ఆప్యాయతను అందించి పంపారు.
This post was last modified on May 9, 2025 7:05 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…