Political News

ఏపీ లిక్క‌ర్ స్కాం.. ఈడీ ఎంట్రీ..

ఏపీని కుదిపేస్తున్న లిక్క‌ర్ కుంభ‌కోణం వ్య‌వ‌హారంపై ఇప్పుడు కేంద్రం ప‌రిధిలోని ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ దృష్టి పెట్టింది. ఏపీ మ‌ద్యం కుంభ‌కోణంలో ఏం జ‌రిగిందో త‌మ‌కు వివ‌రాలు ఇవ్వాల‌ని లిక్క‌ర్ స్కామ్‌ను విచారిస్తున్న ప్రత్యేక ద‌ర్యాప్తు బృందానికి లేఖ రాసింది. దాదాపు 3200 కోట్ల రూపాయ‌లకు పైగా నిధులు చేతులు మారాయ‌ని.. మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగింద‌ని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం భావిస్తోంది.

దీనిలో అనేక మంది పాత్ర ఉంద‌ని, లిక్క‌ర్ ద్వారా అందిన సొమ్ములు.. భార‌తి సిమెంట్స్‌లో ప‌ని చేస్తున్న బాలాజీ గోవింద‌ప్ప‌.. ఇత‌ర దేశాల‌కు త‌ర‌లించార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో మొ త్తం 3 వేల కోట్ల కు పైగా సొమ్ము ఎటు పోయింది? ఎవ‌రి ఖాతాలోకి చేరింద‌నే విష‌యాలు కీల‌కంగా మారా యి. వాస్త‌వానికి ఇలాంటి ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం.. ఈడీకి లేఖ రాస్తుంది. ద‌ర్యాప్తు చేయాల‌ని కోరుతుంది. కానీ, ఇక్క‌డ ఈడీనే విష‌యంపై ఆసక్తి చూపింది.

మద్యం కేసుకు సంబందించిన వివరాలను అందజేయండి అని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందానికి నేతృ త్వం వ‌హిస్తున్న‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్ ను ఈడీ అదికారులు కోరారు. మనీలాండరింగ్‌ నిరోధక చ ట్టం-2002 ప్రకారం తాము కూడా జోక్యం చేసుకునేందుకు అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. ఈ నేపథ్యం లో ఇప్ప‌టి వ‌ర‌కు.. జ‌రిగిన విచార‌ణ‌, నిందితుల వాంగ్మూలం వంటివి కీల‌కంగా మార‌నున్నాయి. వీటిని ఈడీకి అందించేందుకు సిట్ అధికారులు రెడీ కానున్నారు.

మ‌రో వైపు.. హైకోర్టు కూడా ఈకేసును తీవ్రంగా ప‌రిగ‌ణించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ముంద‌స్తు బెయిల్ కోరిన ధ‌నుంజ‌య్‌రెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి బాలాజీ గోవింద‌ప్ప‌ల‌కు బెయిల్ నిరాక‌రించింది. అంతేకాదు.. వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే.. త‌ప్ప నిజాలు బ‌య‌ట‌కు రావ‌ని కూడా పేర్కొంది. 3 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగానే మ‌నీ లావాదేవీలు జ‌రిగాయ‌న‌డానికిప‌క్కా ఆధారాలు ఉన్నాయ‌ని కూడా హైకోర్టు పేర్కొంది. మ‌రోవైపు.. సుప్రీంకోర్టులోనూ తాజాగా వీరికి ఎదురు దెబ్బ త‌గిలింది. ఆ వెంట‌నే ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. సో.. మొత్తంగా చూస్తే.. వైసీపీ లిక్క‌ర్ కుంభ‌కోణం పెద్ద కేసుగానే మారుతోంది.

This post was last modified on May 8, 2025 9:11 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

9 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago