రెడ్డినేతలందు.. ఈ రెడ్డి వేరయా! అని అనిపిస్తున్నారు నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. హార్డ్ కోర్ జగన్ అభిమాని అయిన కోటంరెడ్డి గత ఎన్నికలకు ముందు వైసీపీని వదిలేసి టీడీపీ సైకిల్ ఎక్కారు. వాస్తవానికి టీడీపీ అంటేనే అనేక మంది నాయకులు, కార్యకర్తలు.. అనేక అభిప్రాయాలు.. ఉంటాయి. దీంతో చాలా నియోజకవర్గాల్లో పనులు ముందుకు సాగడం లేదు. ఈ విషయంపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి.
దీంతో తరచుగా చంద్రబాబు తన పార్టీ నాయకులకు క్లాసులు ఇస్తూనే ఉన్నారు. అయితే.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాత్రం దీనికి భిన్నంగా కోటంరెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండానే పనులు చేస్తున్నారు. “ఒకరు మెచ్చుకోని.. లేకపోనీ.. నాకెందుకు. నేను ప్రజల కోసం పనిచేస్తున్నా” అని చెప్పే కోటంరెడ్డి.. నియోజకవర్గంలో వైసీపీ హయాం నుంచి పెండింగు లో ఉన్న పనులకు ఇప్పుడు శ్రీకారం చుట్టారు.
తాజాగా ఈ పనుల ఆమోదం కోసం సీఎం చంద్రబాబును కలిసిన కోటంరెడ్డి.. వీటిలో తనకు కేటాయించిన 35 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశానని.. మిగిలిన వాటికి కూడా నిధులు కేటాయించాలని ఆయన కోరారు. అదే సమయంలో తనకు అప్పగించిన బాధ్యతలు కూడా నెరవేర్చానని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి పెద్ద బుక్ లెట్‌నే సీఎం చంద్రబాబు చేతుల్లో పెట్టారు. దీనిలో సమగ్ర వివరాలను ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నిజానికి చంద్రబాబు కూడా.. పనులు చేయాలనే చెబుతున్నారు. ఎమ్మెల్యేలు ప్రజల మధ్య ఉండాలనే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు నివేదిక రూపంలో కూడా ఆయా పనులను అందించడంతో పాటు ప్రజలకు చేరువగా ఉన్న కోటంరెడ్డిని చూసి మురిసిపోయారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలకు సహకరిస్తోందని.. అభివృద్ధి పనులకు నిధులు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. దీంతో కోటంరెడ్డి మరింత హ్యాపీగా ఫీలయ్యారు.
This post was last modified on May 6, 2025 2:17 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…