భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధానికి దారితీయొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతు న్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సోమవారం సాయంత్రం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. ప్రజలు ఏ విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేలా.. శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాలకు తేల్చి చెప్పింది. ఈ క్రమంలో రాష్ట్రాల వ్యాప్తంగా మాక్ డ్రిల్‌ను నిర్వహించాలని పేర్కొంది. వరుసగా మూడు రోజుల పాటు మాక్ డ్రిల్ చేపట్టి.. రక్షణ, స్వీయ భద్రత విషయాల్లో ప్రజలకు తర్ఫీదునివ్వాలని ఆదేశించింది.
ఈ కార్యక్రమంలో పౌరులు, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, అన్ని పార్టీల వారిని మిళితం చేయాలని కేంద్ర ప్రబుత్వం స్పష్టం చేసింది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. తమను తాము కాపాడుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉండేలా రాష్ట్రాలే చొరవ చూపాలని తెలిపింది. ఈమేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు రక్షణ, హోం శాఖల నుంచి కీలక సమాచారం అందించింది. దీనిలో భాగంగా అగ్ని మాపక శాఖలను కూడా అప్రమత్తం చేసింది. అగ్నిమాపక శకటాలను పదే పదే పరిశీలించాలని, ఉద్యోగులకు వచ్చే 15 రోజుల పాటు అందరూ అందుబాటులో ఉండేలా షెడ్యూల్ తయారు చేసుకోవాలని పేర్కొంది.
ఎందుకిలా?
దేశంలో ఇలా.. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. గతంలో దాదాపు 50 ఏళ్ల కిందట పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు.. చైనాతో వివాదాలు తలెత్తినప్పుడు ఆహార ధాన్యాలను భద్ర పరుచు కోవాలని అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి రేడియోలో ప్రకటించారని అంటారు. ఆ తర్వాత ఎప్పుడూ.. ఈ మేరకు.. ఇలా.. హెచ్చరికలు జారీ చేసింది లేదు. పైగా.. పాకిస్థాన్‌తో మనకు తరచుగా ఉద్రిక్తతలు ఉన్నా.. ఇంతగా హెచ్చరించిన పరిస్థితి లేదు. కానీ.. ఈ దఫా పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అనంతరం..(గత నెల 22న) దేశవ్యాప్తంగా పాకిస్థాన్‌కు వ్యతిరేక ర్యాలీలు జరుగుతున్నాయి. మరోవైపు.. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు మద్దతు వస్తోంది.
తాజాగా రష్యా కూడా.. భారత్కు మద్దతు ప్రకటించింది. మరోవైపు.. త్రివిధ దళాలను కూడా కేంద్రం అప్రమత్తం చేసి.. మాక్ డ్రిల్ చేపడుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌పై భారీ వ్యూహంతోనే భారత్ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కూడా తాము క్షిపణిదాడులకు దిగక తప్పదని హెచ్చరించింది. ఈ పరిణామాలను గమనించిన కేంద్రం.. ప్రజలను కూడా అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ ఒక్క జమ్ము కశ్మీర్‌పైనే కాకుండా.. భారత్‌లోకి చొచ్చుకువచ్చి ఏ రాష్ట్రంపైనైనా దాడి చేస్తే.. ప్రజలు తమను తాము రక్షించుకునేలా వ్యూహాత్మకంగా కేంద్రం వ్యవహరిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
This post was last modified on May 5, 2025 10:28 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…