“మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి” అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది. ఈ నెలలోనే ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేయనున్నట్టు పేర్కొంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన కీలక హామీల్లో ఇది కూడా ఒకటి. రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున ఇస్తామని అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఈ నెలలో శ్రీకారం చుట్టనున్నారు.
దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం లబ్ధి దారులుగా ఉన్న రైతులతో పాటు .. కౌలు రైతులను కూడా దీనిలో లబ్ధిదారులుగా చేర్చుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఒక్కొక్క రైతులకు ఏటా 20 వేలరూపాయల చొప్పున సొమ్ములు సాయం చేయనుంది. గతంలో కౌలు రైతులకు సొమ్ములు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం నేరుగా భూ యజమానుల ఖాతాల్లో వేసింది. దీంతో కౌలు రైతులు లబోదిబో మన్నారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు కూడా సొమ్ములు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.
ఈ నేపథ్యంలో తాజాగా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే.. ప్రభుత్వం ఇచ్చే రూ.20 వేలను మూడు దఫాలుగా ఇవ్వనున్నారు. దీనిలో కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ యోజన ను కూడా కలిపి అందిస్తారు. అంటే.. ప్రభుత్వం 14 వేలు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6 వేలను కలిపి మొత్తం 20 వేలను మూడు విడతులుగా బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్టు సర్కారు తెలిపింది.
ఇప్పటికే అర్హులైన వారి జాబితాలు రెడీ అయ్యాయని.. మరింత అర్హులైన వారు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను కలిసి వినతి పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. అలానే.. బ్యాంకు ఖాతాలను అప్ డేట్ చేసుకోవాలని పేర్కొంది. తొలి విడతలో కేంద్రం ఇచ్చే రూ.2 వేలతో కలిపి.. 3600 చొప్పున రాష్ట్రం కలిపి.. బ్యాంకుల్లో జమచేయనున్నట్టు వివరించింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
This post was last modified on May 5, 2025 5:08 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…