Political News

అమరావతి ఒక నగరం కాదు… ఒక శక్తి: మోదీ తెలుగు పలుకులు

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు అమరావతి పరిధిలోని వెలగపూడి సచివాలయం వెనుక ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభా వేదిక మీద నుంచే మోదీ… అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అమరావతి పనులతో పాటుగా ఏపీలో పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులను కూడా మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సాహంగా ప్రసంగించిన మోదీ… అమరావతిని ఓ నగరంగా కాకుండా ఓ శక్తిగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి అని కూడా ఆయన అభివర్ణించారు. తన ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించిన మోదీ… తన ప్రసంగంలో పలుమార్లు తెలుగు పదాలను పలుకుతూ సభకు హాజరైన వారిని ఉర్రూతలూగించారు. 

అమరావతిని రానున్న మూడేళ్లలోనే పూర్తి చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన మోదీ… ఆ శక్తి ఏపీ ప్రజలకు, కూటమి సర్కారుకు ఉందని తెలిపారు. పనులను చక్కబెట్టడంలోనే కాకుండా… ఆయా పనులను నాణ్యతా ప్రమాణాలతో కూడా సకాలంలో పూర్తి చేసే సత్తా చంద్రబాబుకు ఉందని కూడా మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను గుజరాత్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలో అప్పటికే చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉన్నారని, నాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీని నిర్మించిన చంద్రబాబు పనితనాన్ని చూశానని, దానిపై తాను అధ్యయనం చేశానని, అధికారులను పంపి అధ్యయనం చేయించానని కూడా మోదీ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో రానున్న మూడేళ్లలోనే పూర్తి అవుతుందన్న నమ్మకం తనకు ఉందని కూడా మోదీ అన్నారు. ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్న మోదీ… ఆ దిశగా ఏఫీకి ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. 

అమరావతిని ఏపీకి రాజధానిగా మాత్రమే చూడదలచుకోలేదన్న మోదీ… వికసిత్ భారత్ లో భాగంగానే అమరావతిని చూడాలనుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతుందని చెప్పిన మోదీ… ఇదే వేగాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా మోదీ ఏపీ ప్రజల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కలలు కనే వారు ఎక్కువగా ఉన్నారన్న మోదీ… కలలను కనే వారితో పాటుగా వాటిని సాకారం చేసుకుంటున్న వారు కూడా ఏపీలో అధికంగానే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏపీకి గతంలో కంటే మెరుగైన రీతిలో కేంద్ర నిధులను కేటాయిస్తున్నామన్న మోదీ… రైల్వే కేటాయింపుల్లోనూ ఏపీతో పాటు తెలంగాణకు కూడా భారీ ఎత్తున నిదులను కేటాయిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు కోరినట్టుగా ఈ ఏడాది ప్రచంచ యోగా దినోత్సవ వేడుకలకు తాను ఏపీకి వస్తానని కూడా మోదీ ప్రకటించారు.

This post was last modified on May 3, 2025 11:16 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

22 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago