టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లో దినదినాభివృద్ది సాధిస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి బంపర్ విక్టరీ అందించిన లోకేశ్… ఆ తర్వాత కూడా ప్రభుత్వ పాలనలో తనదైన దూకుడుతో సాగుతున్నారు. ఓ వైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వం, ఇంకోవైపు కూటమిలోని మిత్రపక్షాలు… అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సాగుతున్న లోకేశ్ తీరు నిజంగానే అద్భుతమనే చెప్పాలి. ఈ విషయాలు తెలిసే కాబోలు… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో లోకేశ్ పట్ల ఎనలేని అప్యాయత వ్యక్తమవుతుందేమో? నిజమే మరి.. ఓ యువకుడిగా లోకేశ్ ఈ మేర సత్తా చాటుతూ ఉంటే… ఎవరికైనా ఆయనను అభినందించాలని ఉంటుంది కదా. మోదీ కూడా అదే చేస్తున్నారు.
మొన్నామధ్య విశాఖకు వచ్చిన సందర్భంగా లోకేశ్ ను తన దగ్గరకు పిలుచుకున్న మోదీ… లోకేశ్ చేతులు పట్టుకుని.. ఏదో ఓ స్నేహితుడితో సరదా గడుపుతున్నట్లుగా… లోకేశ్ చేతులను మెలి తిప్పుతూ, ఆ చేతులతో విన్యాసాలను చేయిస్తూ మోదీ సాగారు. ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ వచ్చి తన ఆతిథ్యం స్వీకరించాలంటూ నాడు లోకేశ్ కు మోదీ స్వాగతం పలికారు. స్వయంగా ప్రధాని తనను అంత దగ్గరగా తీసుకుని…తనతో సరదాసరదాగా గడుపుతూ ఆహ్వానిస్తే లోకేశ్ కూడా కాదనలేకపోయారు. సరే సార్ త్వరలోనే వస్తానంటూ మోదీకి చెప్పారు. కట్ చేస్తే… అప్పుడే నెలలు గడిచి పోయాయి. మోదీ తన పనిలో పడిపోయారు. లోకేశ్ తన షెడ్యూల్ తో బిజీ అయిపోయారు. మోదీ ఆహ్వానానన్నే మరిచిపోయారు. ఈలోగా మోదీ మరోసారి ఏపీకి రానే వచ్చారు.
అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ శుక్రవారం నేరుగా అమరావతికే వచ్చారు. ఈ సందర్భంగా మోదీని వేదిక మీదకు ఆహ్వానించే క్రమంలో తన తండ్రి, సీఎం చంద్రబాబుతో కలిసి లోకేశ్ మోదీ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా లోకేశ్ తన ఆహ్వానం మేరకు ఢిల్లీ రాలేదన్న విషయం మోదీకి గుర్తుకు వచ్చినట్టుంది. వెంటనే లోకేశ్ చేతులను ఇదివరకటి మాదిరిరే దొరకబుచ్చుకున్న మోదీ..మరోమారు లోకేశ్ తో సరదాగా గడిపారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు… ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ రావాలని, తనను కలవాలని అని మరోమారు లోకేశ్ తో మోదీ అన్నారు. మోదీకి మళ్తీ దొరికిపోయాయనన్న భావనతో ఈ సారి తప్పకుండా వస్తానంటూ లోకేశ్ చెప్పినా…మోదీ ఆయన చేతులను అలాగే పట్టుకుని చాలా సేపు అలా సరదాగా ఉండిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి.
This post was last modified on May 3, 2025 8:53 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…