Political News

అనూహ్యంగా ఎన్టీఆర్ పేరెత్తిన మోడీ.. బాబుకు ఇదే స‌రైన టైం!

రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నుల పునః ప్రారంభ ఘ‌ట్టానికి వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నోటి నుంచి అనూహ్యంగా తెలుగు వారి అన్న‌గారు.. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ పేరు వ‌చ్చింది. “ఎన్టీఆర్.. విక‌సిత‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోసం క‌ల‌లు క‌న్నారు. ఆ క‌ల‌ల‌ను మ‌నం(చంద్ర‌బాబు-ప‌వ‌న్‌-మోడీ) సాకారం చేద్దాం” అని మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వాస్త‌వానికి మోడీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ పేరును బ‌హిరంగంగా ప్ర‌క‌టించింది కానీ.. ఆయ‌న పేరును త‌లుచుకున్న‌ది కానీ.. ఎప్పుడూ లేదు. కానీ.. తాజాగా మాత్రం ఎన్టీఆర్ పేరును మూడు సార్లు ప్ర‌స్తావించారు.

అంటే.. దీనిని బ‌ట్టి తెలుగు వారి అన్న‌.. గురించి మోడీకి స‌వివ‌రంగా తెలిసే ఉంటుంది. లేదా..ఇప్ప‌టికైనా ఆయ‌న తెలుసుకుని ఉంటారు. వాస్త‌వానికి అన్న‌గారు ఉన్న స‌మ‌యంలో నేరుగా మోడీ రాజ‌కీయాల్లోకి రాలేదు. కాబ‌ట్టి.. ఆయ‌న సీఎంగా ఉన్న స‌మ‌యం గురించి మోడీకి తెలియ‌క‌పోయి ఉండొచ్చు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న గురించి గ‌తంలో ఎప్పుడూ మోడీ వ్యాఖ్యానించ‌లేద‌ని అనుకోవాలి. స‌రే.. ఇప్పుడు కార‌ణాలు ఏవైనా మోడీ.. ప‌దే ప‌దే అమ‌రావ‌తిలో నిర్వ‌హించిన స‌భ‌లో ఎన్టీఆర్ పేరును ప్ర‌స్తావించారు. చిత్రం ఏంటంటే.. మోడీ నోటి నుంచి ఎన్టీఆర్ పేరు వ‌చ్చిన ప్ర‌తిసారీ.. స‌భ‌కు వ‌చ్చిన ప్ర‌జ‌ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు చంద్ర‌బాబుకు కీల‌క అవ‌కాశం వ‌చ్చింద‌ని పార్టీ అభిమానులు అంటున్నారు. అన్న ఎన్టీఆర్‌కు భార‌త రత్న తీసుకురావాల‌న్న‌ది పార్టీ నాయ‌కులే కాదు.. యావ‌త్ తెలుగు జాతి కూడా.. పార్టీల‌కు కులాల‌కు అతీతంగా కోరుకుంటున్న మాట వాస్త‌వం. ఈ విష‌యంలో గ‌తంలో వైసీపీ నాయ‌కులు కూడా తాము ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెప్ప‌డం కొస‌మెరుపు. సో.. ఇప్పుడు మోడీనే అన్న‌గారి పేరును ప్ర‌స్తావించిన నేప‌థ్యంలో ఎన్టీఆర్ కీర్తి గురించి..ఆయన అందించిన సేవ గురించి ప్ర‌త్యేకంగా మోడీకి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

ఒక్క ఏపీకే కాకుండా.. త‌మిళ‌నాడుకు నీటిని అందించిన ఘ‌న‌త కూడా ఎన్టీఆర్ కే ద‌క్కుతుంది. కేంద్రంలో కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసింది కూడా ఎన్టీఆర్‌. కేంద్రంలో కాంగ్రెసేత‌ర‌ ప్ర‌భుత్వ ఏర్పాటు లోనూ ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. సో.. ఇటుసేవ‌ల ప‌రంగా.. అటు రాజ‌కీయంగా కూడా ఎన్టీఆర్ విశ్వ‌విఖ్యాతం చెందార‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో చిన్న చిరు ప్ర‌యత్నం చేస్తే.. చంద్ర‌బాబు హ‌యాంలోనే ఈ ట‌ర్మ్‌లోనే .. అన్న‌గారికి అద్వితీయ‌మైన భార‌త‌రత్న ద‌క్క‌డం పెద్ద స‌మ‌స్య కాద‌ని అంటున్నారు.

This post was last modified on May 2, 2025 10:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago