కులాల వారీగా దేశంలో జనాభాను గణించేందుకు మార్గం సుగమం అయ్యింది. ఏళ్ల తరబడి పలు వర్గాల నుంచి ఈ డిమాండ్ వినిపిస్తున్నా… ఆ దిశగా ఇప్పటిదాకా అడుగు ముందుకు పడలేదు. అయితే తాజాగా బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కుల గణన దిశగా కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే ఏడాది చేపట్టనున్న జన గణన సమయంలోనే కుల గణనను కూడా చేపట్టాలని కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
కుల గణన రాజకీయంగా చాలా సున్నితమైన అంశమన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో రిజర్వేషన్లను అందుకుంటున్న ఆయా సామాజిక వర్గాలు తమ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ ప్రధానంగా బీసీ వర్గాల నుంచే వినిపిస్తోంది. దేశ జనాభాలో సగానికి పైగా తామే ఉన్నామని చెబుతున్న బీసీలు ఆ మేరకు తమకు తగినంత మేర రిజర్వేషన్లు మాత్రం దక్కడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కుల గణన చేపట్టి… అందులో వచ్చిన ఫలితాల ఆధారగా రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించాలని ఆ వర్గాలు డిమాడ్ చేస్తున్నాయి.
ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కుల గణనను చేపట్టింది. ఈ కుల గణన ఆధారగా రిజర్వేషన్లను మారుస్తున్నట్లు కూడా రేవంత్ సర్కారు ప్రకటించింది. ఆ మేరకు తాను తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రానికి కూడా పంపింది. తాము తీసుకున్న నిర్ణయానికి అనుమతి ఇవ్వాలని కూడా కేంద్రాన్ని తెలంగాణ కోరింది. అంతేకాకుడా కేంద్రం కూడా దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కూడా మోదీ సర్కారును తెలంగాణ కోరింది. తెలంగాణ లోని తమ పార్టీ ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కొనియాడింది.
తాము అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి సర్కారులో దీనిపై గత కొంతకాలంగా ఒకింత లోతుగానే చర్చ సాగింది. ఎట్టకేలకు కుల గణనకు అనుకూలంగా ఎన్డీఏ నిర్ణయం తీసుకోగా… ఆ నిర్ణయానికి బుధవారం నాటి కేంద్ర కేబినెట్ భేటీ ఆమోద ముద్ర వేసినట్టు అయ్యింది. కేంద్రం ప్రకటించినట్లుగా కుల గణన జరిగిన తర్వాత ఆయా వర్గాలకు అందుతున్న రిజర్వేషన్ల శాతాల్లోనూ మార్పులు చోటుచేసుకోవడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on May 1, 2025 2:16 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…