Political News

సింహాచ‌లం సెగ‌: క‌లెక్ట‌ర్ ట్రాన్స్‌ఫ‌ర్‌.. చంద్ర‌బాబు డెడ్‌లైన్‌!

విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని ప్ర‌ముఖ దేవాల‌యం సింహాచ‌లంలో బుధ‌వారం తెల్ల‌వారు జామున ఓ గోడ కూలి భ‌క్తుల‌పై ప‌డిన ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తం గానే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం రేపింది. దీనిపై ప్ర‌ధాని నుంచి రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు ప్రగాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు. ఇక‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్ర సానుభూతి వ్య‌క్తం చేస్తూనే.. అధికారుల‌పై నిప్పులు చెరిగారు.

తాజాగా విశాఖ‌ప‌ట్నం ఉన్న‌తాధికారులతో పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేల‌తోనూ ఆయ‌న వీడియో కాన్ఫ‌రె న్స్ నిర్వ‌హించారు. అస‌లు ఈ ఘ‌ట‌న ఎలా జ‌రిగింది? ఎవ‌రి నిర్ల‌క్ష్యం ఉంది? ముందుగా చేసిన ఏర్పాట్లు ఏంటి? గ‌త ఏడాది కంటే.. ఈ సారి ఎక్కువ మంది భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిసినా.. ఎందుకు నిర్ల‌క్ష్యంగా ఉన్నారంటూ.. నిప్పులు క‌క్కారు. ఈ క్ర‌మంలో క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పై మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏర్పాట్ల‌కు సంబంధించి ఎన్ని సార్లు సమీక్షించార‌ని ఆయ‌న‌ను ప్ర‌శ్నించారు.

అయితే.. తాను ఒకే ఒక్క‌సారి స‌మీక్షించాన‌ని.. విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తాను సింహాచలంపై ఎక్కువ‌గా దృష్టి పెట్ట‌లేక‌పోయాన‌ని వివ‌రించారు. దీనిపైనా సీఎం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అదేస‌మ‌యంలో జిల్లాకు చెందిన హోం మంత్రి అనిత‌పైనా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఏర్పాటు చేసే ముందు మీరు ప‌ర్య‌వేక్షించారా? అని ఆమెను కూడా నిల‌దీశారు. మొత్తంగా వీడియో కాన్ఫ‌రెన్స్ హాట్‌హాట్‌గా జ‌రిగింది.

అనంత‌రం.. విశాఖ‌ప‌ట్నం క‌లెక్ట‌ర్‌గా హ‌రేంధిర‌ ప్ర‌సాద్ ను బ‌దిలీ చేయాల‌ని.. త‌ర్వాత ప‌రిణామాల‌ను బ‌ట్టి.. వేరే పోస్టు ఇవ్వాల‌ని సీఎస్‌ను ఆదేశించారు. అదేవిధంగా సింహాచ‌లం ఘ‌ట‌న‌పై త‌న‌కు 72 గంట‌ల్లోగా నివేదిక‌ను అందించాల‌ని కూడా.. సీఎం చంద్ర‌బాబు అధికారులకు డెడ్‌లైన్ విధించారు. మంత్రులు కూడా.. విడిగా త‌న‌కు నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. కూలిపోయిన గోడ‌ను క‌ట్టించిన కాంట్రాక్ట‌ర్‌పైనా కేసులు పెట్టాల‌న్నారు.

This post was last modified on April 30, 2025 2:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆగకుండా ఆగమాగం చేస్తున్న దురంధర్

దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…

9 hours ago

సహానా సహానా… అంచనాలు అందుకున్నానా

రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…

10 hours ago

షర్మిలకు బాబు, పవన్, లోకేష్ విషెస్… మరి జగన్?

చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…

12 hours ago

‘సింపతీ కార్డ్’పై నాగవంశీ కౌంటర్

సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…

14 hours ago

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సంచలన నిర్ణయం

తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…

14 hours ago

కొత్త రిలీజుల తాకిడి… అవతారే పైచేయి

అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…

15 hours ago