బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటే అలవి కానంత ద్వేషం ఉందన్న వాదన ఎప్పటినుంచో ఉన్నదే. ఆ మాట నిజమేనని తాజాగా మరోసారు నిరూపితమైంది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపై తెలంగాణను వ్యతిరేకించింది కాంగ్రెస్పేనని కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ తో సంబంధం లేని, తెలంగాణకు అనుకూలంగా ఉన్న చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ మాట విన్నంతనే… దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి బదులుగా చంద్రబాబు పేరును కేసీఆర్ ప్రస్తావించారన్న వాదనలు వినిపించాయి.
నాటికీ, నేటికీ తెలంగాణను వ్యతిరేకిస్తున్న పార్టీగా కాంగ్రెస్ గుర్తింపు సంపాదించుకుందని కేసీఆర్ సెటైర్లు సంధించారు. ఈ సందర్బంగా చంద్రబాబు పేరును ప్రస్తావించిన కేసీఆర్… అసెంబ్లీలో తెలంగాణ అన్న పదమే వినిపించకుండా చేసిన ఘనుడు అంటూ చంద్రబాబును విమర్శించారు. సీఎం స్థానంలో ఉండి.. నాడు అసెంబ్లీలో తెలంగాణ అన్న పదమే వినిపించ రాదన్న రీతిలో చంద్రబాబు సాగారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే నాడు తెలంగాణ పట్ల చంద్రబాబు వ్యతిరేకతను ఎదుర్కొని నిలిచామని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. అందులో బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ ముందున్నారని ఆయన అన్నారు.
వాస్తవానికి టీఆర్ఎస్ ఆవిర్భవించింది 2001లో. ఆ సమయంలో చంద్రబాబే సీఎంగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేరు. 2004లో జరిగిన ఎన్నికల్లో తొలి సారి టీఆర్ఎస్ సభ్యులు సభలో అడుగుపెట్టారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి దాస్యం వినయ్ భాస్కర్ 2009 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాడు వైఎస్ఆర్ సీఎంగా ఉన్నారు. టీఆర్ఎస్ ను అసెంబ్లీలో ఇరుకున పెట్టింది కూడా వైఎస్సారే. తెలంగాణ వస్తే హైదరాబాద్ కు వీసా తీసుకుని మరీ వెళ్లాలని వ్యాఖ్యలు చేసిందీ వైఎస్సారే. వెరసి తెలంగాణ పట్ల పూర్తిగా వ్యతిరేకంగా సాగింది వైఎస్సారే.
తెలంగాణకు తాము అనుకూలమేనంటూ ఆ తర్వాత దాదాపుగా అన్ని పార్టీలు కేంద్రానికి లేఖలు రాయగా.. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ తొలి లేఖను అందించింది. ఈ లెక్కన తెలంగాణకు చంద్రబాబు వ్యతిరేకం కాదు. తెలంగాణకు వ్యతిరేకమని చంద్రబాబు ఏనాడూ చెప్పలేదు. మరి ఎల్కతుర్తి సభలో చంద్రబాబు పేరును కేసీఆర్ ప్రస్తావించాల్సిన అవసరం ఏమీ లేదు కదా. తెలంగాణను వ్యతిరేకించిన సీఎంగా చంద్రబాబును విమర్శించాల్సిన అవసరం అంతకన్నా లేదు కదా. అంటే… వైఎస్సార్ పేరును ప్రస్తావిస్తూ విమర్శలు చేయాల్సిన కేసీఆర్.. చంద్రబాబును విమర్శించారన్న మాట. ఇక తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్సార్ ను ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ కీర్తించారు. అంటే కేసీఆర్ నోట ద్వేషం అంటే చంద్రబాబు… పొగడ్త అంటే వైఎస్సార్ పేర్లు వినిపిస్తాయన్న మాట.
This post was last modified on April 28, 2025 11:40 am
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…