ఏపీ రాజధాని అమరావతి పరుగులు పెడుతోంది. ఈ నెల 13 నుంచి పనులు శర వేగంగా పూర్తవుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి 8 వేల కోట్ల రూపాయలు సుమారుగా ప్రభుత్వానికి చేరాయి. దీనికి తోడు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తం కేటాయించింది. ఫలితంగా ప్రస్తుతం 15 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనికి కాంట్రాక్టర్లు కూడా తోడయ్యారు. దీంతో సుమారు 65 వేల కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ తాజాగా అమరావతి నిర్మాణాలకు సంబంధించి వీడియోను రాష్ట్ర ప్రజలతో పంచుకున్నారు. మొత్తం నవనగరాలు, నివాసాలు, హైకోర్టు, సచివాలయం.. సహా ఏయే భవనాలు వస్తున్నాయో.. ఈ వీడియోలో వివరించారు. అదేవిధంగా కృష్ణానదిపై నిర్మించనున్న అమరావతి-హైదరాబాద్ రహదారి అనుసంధానం ప్రాజెక్టును కూడా పేర్కొన్నారు. అలానే.. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని కూడా.. వీడియోలో సమగ్రంగా చూపించారు.
రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమై.. వడివడిగా సాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షం వైసీపీ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేలా నారా లోకేష్ ఈ వీడియోను పంచుకోవడం గమనార్హం. అంతేకాదు.. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నదీ ఈ వీడియోలో వివరించారు. మొత్తంగా రాజధాని సమగ్ర రూపాన్ని స్వల్ప వ్యవధిలోనే రూపించడం గమనార్హం. కాగా.. రాజధాని పనులను సోమవారం సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. అదేవిధంగా వచ్చే నెల 2న ప్రధాని మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా.. సీఎం పర్యవేక్షించనున్నారు.
This post was last modified on April 28, 2025 5:37 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…