వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సొంత మీడియా వ్యవహారాలు కొలిక్కి వస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం బ్రాడ్ కాస్టింగ్ పనులపై ఆయన బిజీబిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్-బెంగళూరు-ఢిల్లీ అంటూ.. వారం వారం ఆయన చక్కర్లు కొడుతున్నారు. గతంలో ఓ కీలక ఛానెల్‌లో సీఈవోగా చేసిన వ్యక్తితో సంప్రదింపులు జరుగుతున్నాయని మీడియా వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ ఏడాది దసరా నాటికి ‘వి-టీవీ’ పేరుతో సంస్థను స్థాపించే అవకాశం ఉందని కూడా మీడియా వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన ఫండింగ్ వ్యవహారాలు.. ఉత్తరాదికి చెందిన ఓ వ్యాపార వేత్త చూస్తున్నారని.. ఆయనకు కూడా భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది. గత ఏడాది తను సొంతగా మీడియా పెడతానంటూ.. సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. ఆయన అప్పట్లో ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారు.
కానీ, తర్వాత.. యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకొని.. వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో సొంత చానెల్ వ్యవహారం కూడా ఆగిపోయిందని అనుకున్నారు. అదే సమయంలో రాజకీయాల నుంచి కూడా సాయిరెడ్డి విరమించుకున్నారన్న చర్చ జరిగింది. కానీ.. సాయిరెడ్డిని జాతీయ పార్టీ ఒకటి ఆహ్వానిస్తున్నట్టు వార్తలు రావడంతోపాటు.. తనకంటూ.. ప్రత్యేక వేదిక ఉండాలని కూడా సాయిరెడ్డి భావిస్తున్నారు. సో.. ఇండిపెండెంట్‌గా అయినా.. ఆయన రాజకీయాలు చేసే ఆలోచనలో ఉన్నారు.
దీంతో సొంత ఛానెల్ వ్యవహారాన్ని ఆయన నిలుపుదల చేయలేదని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రీ-చానెల్ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని సమాచారం. అయితే.. దీనిపై పెద్దగా ప్రచారం జరగకుండా సాయిరెడ్డి జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇటీవల ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడినప్పుడు సొంత మీడియా గురించి.. అడగ్గా.. త్వరలోనే అప్‌డేట్ ఉంటుందని వ్యాఖ్యానించి.. జారుకున్నారు. అంతకుమించి ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. సో.. దీనిని బట్టి తెరవెనుక ఏర్పాట్లు ముమ్మరంగానే సాగుతున్నాయని తెలుస్తోంది.
This post was last modified on April 27, 2025 12:29 pm
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…