ఒకపుడు దేశంలో సంచలనం సృష్టించిన ఓటుకునోటు కేసులో కుట్ర జరిగిందనేందుకు అవసరమైన సాక్ష్యాధారాలున్నట్లు ఏసీబీ కోర్టు అభిప్రాయపడింది. ఓటుకునోటు కేసును హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో తమను ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించారు కాబట్టి తమ పేర్లను తొలగించాలని కోరుతు ఎంఎల్ఏ సండ్ర వెంకటవీరయ్య, రుద్ర ఉదయసింహ వేసిన డిస్చార్జి పిటీషన్ను కోర్టు కొట్టేసింది. నిందితుల పై అభియోగాలు నమోదు చేసేందుకు వీలుగా కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాంబశివరావునాయుడు ప్రకటించారు.
2015 తెలంగాణాలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున వేం నరేంద్రరెడ్డి పోటి చేశారు. నిజానికి ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి గెలిచే అవకాశం లేదు. అయినా పోటీకి దిగటంతో అందరు ఆశ్చర్యపోయారు. తర్వాత కొద్దిరోజులకు అప్పటి టీడీపీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి తెలంగాణా నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ ఇంట్లో డబ్బుతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అంటే స్టీఫెన్ ఓటును కొనుగోలు చేయటానికి ముందుగానే రూ. 5 కోట్లకు బేరం కుదుర్చుకున్న విషయం బయటపడింది. మాట్లాడుకున్న బేరంలో భాగంగానే అడ్వాన్సు డబ్బు రూ. 50 లక్షలు ఇవ్వటానికి స్వయంగా రేవంత్ తన అనుచరుడు ఉదయసింహతో కలిసి నామినేటెడ్ ఎంఎల్ఏ ఇంటికి వచ్చారు.
నామినేటెడ్ ఎంఎల్ఏ ఇంట్లో రేవంత్ డబ్బుతో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న ఏసీబీ పోలీసులు హఠాత్తుగా ఇంటిపై దాడిచేసి డబ్బులు లెక్కపెడుతుండగా రేవంత్+ఉదయసింహను పట్టుకున్నారు. ఆ తర్వాత రేవంత్, ఉదయసింహను విచారించినపుడు ఎంఎల్ఏ సండ్ర పేరు బయటకువచ్చింది. పనిలో పనిగా స్టీఫెన్ తో చంద్రబాబునాయుడు ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. దాంతో కేసు అప్పట్లో దేశంలో సంచలనమైంది. ఈ కేసులో ప్రధాన సూత్రదారి చంద్రబాబే అని నిర్ధారణకు వచ్చిన ఏసీబీ పోలీసులు విచారణకు రెడీ అయ్యారు. అయితే చంద్రబాబు హైకోర్టుకెళ్ళి విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్నారు.
ఈ కేసులో ఏసీబీ అరెస్టుచేసిన వారంతా రిమాండులో భాగంగా జైలుకెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ కేసు కారణంగానే రెండు ప్రభుత్వాల మధ్య తీవ్రమైన వివాదం మొదలై చివరకు చంద్రబాబు అర్ధాంతరంగా హైదరాబాద్ నుండి విజయవాడకు మకాం మార్చిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి ఇప్పటి వరకు కేసు విచారణ నత్త నడక నడుస్తోంది. అయితే ప్రజా ప్రతినిధుల మీదున్న కేసులను తొందరగా విచారణ చేయాలన్న సుప్రింకోర్టు ఆదేశాల నేపధ్యంలో ఓటుకునోటు కేసు విచారణ మొదలైంది. తాజాగా ఓటుకునోటు కేసులో కుట్ర కోణం ఉందని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడిన కారణంగా విచారణ పూర్తయితే కానీ సూత్రదారులెవరు, పాత్రదారులెవరన్న విషయం బయటపడదు.
This post was last modified on November 3, 2020 3:18 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…