Political News

మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్ట్!

వైసీపీ నాయ‌కురాలు..మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీకి భారీ షాక్ త‌గిలింది. ఆమె మ‌రిది.. విడ‌ద‌ల గోపీని ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఇత‌ర రాష్ట్రాల‌కు పారిపోయేందుకు రెడీ అవుతున్నాడ‌న్న స‌మాచారం తో హుటాహుటిన హైద‌రాబాద్ చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయ‌న‌ను గురువారం తెల్ల‌వారు జామున 5.30 గంట‌ల స‌మ‌యంలో అరెస్టు చేశారు. గురువారం ఉద‌యం 9 గంట‌ల‌కు ఇత‌ర దేశాల‌కు వెళ్లేందుకు గోపి షెడ్యూల్ చేసుకున్న‌ట్టు ఏసీబీ అధికారుల‌కు స‌మాచారం వ‌చ్చింది. దీంతో అలెర్ట‌యి వెంట‌నే అరెస్టు చేశారు. అరెస్టు అనంత‌రం.. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్నారు.

ఏంటి కేసు?

విడ‌ద‌ల ర‌జ‌నీ మంత్రిగా ఉన్న‌స‌మ‌యంలో ప‌ల్నాడు జిల్లాలోని య‌డ్ల‌పాడు గ్రామంలో ఉన్న శ్రీల‌క్ష్మి క్వారీ య‌జ‌మానిని బెదిరించార‌న్న కేసు ఉంది. క్వారీ అనుమ‌తులు నిలిపివేస్తామ‌ని.. లెక్క‌కు మించి త‌వ్వ‌కాలు చేస్తున్నార‌ని.. జీఎస్టీ ఎగ‌వేస్తున్నార‌ని… బెదిరించారు. ఈ క్ర‌మంలో అప్ప‌టి ఐపీఎస్ అధికారి ప‌ల్లె జాషువా కూడా.. ర‌జనీ చెప్పిన‌ట్టు విన్నారు. ఈ బెదిరింపుల్లో ఆయ‌న‌కు కూడా భాగ‌స్వామ్యం ఉందని ఏసీబీ అధికారులు గుర్తించి.. రెండు సార్లు విచార‌ణ‌కు పిలిచారు. ఈ విచార‌ణ‌లో త‌న‌ప్ర‌మేయం ఏమీ లేద‌ని.. అప్ప‌టి మంత్రి ఏం చెబితే అదే చేశాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

ఇక‌, ఈ బెదిరింపుల ద్వారా సుమారు 2 కోట్ల రూపాయ‌ల‌ను మంత్రి తీసుకున్న‌ట్టు య‌జ‌మాని తెలిపారు. మ‌రో 50 ల‌క్ష‌ల‌ను పోలీసులు కూడా తీసుకున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన కూట‌మి స‌ర్కారు…ఏసీబీని విచార‌ణకు ఆదేశించింది. ఈ క్ర‌మంలోనే విడ‌ద‌ల ర‌జ‌నీ.. ఆమె ఇద్ద‌రు మ‌రుదుల ప్ర‌మేయం ఉంద‌ని…వారే క్వారీ య‌జ‌మానిని బెదిరించి… సొమ్ములు వ‌సూలు చేశార‌ని గుర్తించారు. దీనిలో అప్ప‌టి మంత్రి ర‌జ‌నీ పాత్ర కూడా ఉంద‌ని తేల్చారు.

దీంతో త‌న‌ను అరెస్టు చేయ‌కుండా.. ర‌జ‌నీ.. హైకోర్టును ఆశ్ర‌యించారు. ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరారు. అయితే..దీనిపై విచార‌ణ వాయిదా ప‌డుతోంది. ఇంత‌లోనే ఆమె మ‌రిది విదేశాల‌కు పారిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న స‌మ‌చారం అంద‌డంతో పోలీసులు అలెర్ట‌యి.. ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లో అరెస్టు చేశారు. దీంతో ఈ కేసు.. మ‌రింత వేగం పుంజుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు పోలీసులు.

This post was last modified on April 24, 2025 9:29 am

Share

Recent Posts

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

12 minutes ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

16 minutes ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

1 hour ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

1 hour ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

2 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

3 hours ago