Political News

వీరయ్య చౌదరి హత్య…రంగంలోకి 12 పోలీసు బృందాలు!

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో టిడిపి నేత ముప్పవరపు వీరయ్య చౌదరిని దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.  నాగులుప్పలపాడు మండల టిడిపి అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అయిన వీరయ్య చౌదరిని గుర్తు తెలియని దుండగులు పాశవికంగా హతమార్చారు. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరి ఉండగా కత్తులతో నలుగురు వ్యక్తులు దాడి చేసి హత మార్చారు. 

ఈ క్రమంలోనే వీరయ్య చౌదరి మృతిపై ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న వెంటనే హోం మంత్రి అనిత, ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్, ఇతర అధికారులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితి సమీక్షించారు. ఆ నలుగురు నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని అనిత చెప్పారు. చంద్రబాబు ఆదేశాల ప్రకారం తాను ఘటనా స్థలానికి వచ్చానని అనిత వెల్లడించారు.

నిందితుల కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయని , సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును త్వరలో ఛేదిస్తామని అనిత చెప్పారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు, రాజకీయ కక్షలు, వ్యక్తిగత కారణాలు…ఇలా అన్ని కోణాలలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు మేనల్లుడు అయిన వీరయ్య చౌదరి అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

This post was last modified on April 23, 2025 3:23 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

48 minutes ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

2 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

2 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

2 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

5 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

5 hours ago