Political News

పహల్గామ్‌ మార‌ణ హోమానికి మూడు కార‌ణాలు!

జ‌మ్ముక‌శ్మీర్ లోని పహల్గామ్‌ మార‌ణ హోమం.. దేశాన్నే కాదు.. ప్ర‌పంచ దేశాల‌ను కూడా కుదిపేస్తోంది. దేశంలో ఉగ్ర‌వాదానికి చాలా మ‌టుకు తుద‌ముట్టించామ‌ని.. ఇప్పుడు అంత‌ర్గ‌త శ‌త్రువుల‌తో(రాజ‌కీయ నేత‌లు) పోరాడుతున్నామ‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పిన రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం.. ఏపీ స‌హా ప‌లు ప్రాంతాల‌కు చెందిన ప‌ర్య‌ట‌కులు ఉగ్ర‌దాడుల్లో ప్రాణాలు కోల్పోవ‌డం.. మ‌రో వంద‌ల సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు స్థానికంగా చిక్కుకు పోవ‌డం వంటివి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. క‌డ‌ప‌టి వార్త‌లు అందేస‌రికి.. ఇద్ద‌రు మృతి చెందారు. నెల్లూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ ఒక‌రు, విశాఖ‌కు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఒక‌రు ఉగ్ర‌దాడుల్లో ప్రాణాలు కోల్పాయారు. ఇక‌, ఈ మార‌ణ హోమం విష‌యం తెలిసిన వెంట‌నే ప్ర‌ధాని మోడీ త‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని పాకిస్థాన్ మీదుగా రాకుండా.. ప్ర‌త్యామ్నాయ మార్గంలో భార‌త్‌కు చేరుకున్నారు. ఇదిలావుంటే.. అస‌లు పహల్గామ్‌ మార‌ణ హోమానికి కార‌ణాలు ఏంటి? అంత‌ర్గ‌త ఉదాశీన‌తేనా? అంటే.. ఔన‌నే అంటున్నారు ఆర్మీకి చెందిన మాజీ సైనికాధికారులు.

1) ఇంటెలిజెన్స్ నివేదిక‌ల‌ను ప‌ట్టించుకోకపోవ‌డం: ఈ విష‌యాన్ని చాలా మంది సీనియ‌ర్ అధికారులు త‌ప్పుబ‌డుతున్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చి 15 రోజులు అయింద‌ని.. అయిన‌ప్ప‌టికీ సీనియ‌ర్ అధికారులు ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రించార‌ని చెబుతున్నారు. పహల్గామ్‌ లో ఏమాత్రం ఇబ్బంది లేద‌న్న పాత నివేదిక‌ల‌ను ప‌ట్టుకుని వేలాడార‌న్న‌ది వారు చెబుతున్న మాట‌. ఈ అతిశ‌య‌మే ఇప్పుడు కొంప‌ముంచింద‌ని అంటున్నారు.

2) ఆర్మీ రిక్రూట్‌మెంట్లు లేక‌పోవ‌డం: క‌రోనా త‌ర్వాత‌.. దేశంలో నేరుగా ఆర్మీ రిక్రూట్‌మెంట్స్‌ను నిలిపివేశారు. అగ్నివీర్‌ను తీసుకువ‌చ్చినా.. వివాదాల‌సుడిలో చిక్కుకోవ‌డం.. వారంతా కొత్త‌వారు కావ‌డంతో స‌రైన రీతిలో బ‌ల‌గాల‌ను మోహ‌రించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని సీనియ‌ర్ రిటైర్డ్ అధికారులు చెబుతున్నారు. పైగా చైనాతోనే ముప్పు ఎక్కువ‌గా ఉంద‌న్న కార‌ణంగా.. చైనా స‌రిహ‌ద్దుల్లోనే సైన్యాన్నిఎక్కువ‌గా మోహ‌రించిన ఫ‌లితంగా ఇప్పుడు ఇప్పుడు ఈ దుస్థితి వ‌చ్చిందని అంటున్నారు.

3) విధాన ప‌ర‌మైన నిర్ణ‌యం: జ‌మ్ము క‌శ్మీర్‌ను విడ‌దీసి.. కేంద్ర పాలిత ప్రాంతంగా జ‌మ్ములోని కొంత భాగాన్ని కేటాయించినా.. అక్క‌డ శాంతి భ‌ద్ర‌తల స‌మ‌స్య కొన‌సాగుతోంది. దీనికి తోడు.. స్థానికంగా రాజ‌కీయాలు అస్థిర‌త్వంతో కూడుకుని ఉన్నాయి. ఈ నిర్ణ‌యం ఫ‌లితంగానే ఉగ్ర‌వాదుల‌కు పహల్గామ్‌ మార్గం రెడ్ కార్పెట్ ప‌రిచిన‌ట్టు అయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏదేమైనా మోడీ పాల‌న‌ ప‌ది సంవ‌త్స‌రాల్లో ఇదే భారీ ఉగ్ర‌దాడిగా చెబుతున్నారు.

This post was last modified on April 23, 2025 1:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కబుర్లన్నీ చెప్పి ఇదేంటి అమీర్ సాబ్

ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…

17 minutes ago

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు – జగన్

రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…

3 hours ago

థ్యాంక్స్ మోదీజీ: మధుసూదన్ భార్య కామాక్షి!

పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…

4 hours ago

చిన్న షాట్… ఫ్యాన్స్‌కు పూనకాలే

టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో పోటాపోటీగా…

5 hours ago

‘ఆప‌రేష‌న్ అభ్యాస్’.. స‌క్సెస్‌!

ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌దాడి అనంత‌రం.. భార‌త్-పాకిస్థాన్ దేశాల మ‌ధ్య త‌లెత్తిన ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితి ఎదురైనా దేశ ప్ర‌జ‌లు…

7 hours ago

జెండాల్లేవ్‌.. అంతా ఒక్క‌టే అజెండా.. భార‌త్‌లో ఫ‌స్ట్ టైమ్!!

భార‌త దేశానికి శ‌త్రుదేశాల‌పై యుద్ధాలు కొత్త‌కాదు.. ఉగ్ర‌వాదుల‌పై దాడులు కూడా కొత్త‌కాదు. కానీ.. అందరినీ ఏకం చేయ‌డంలోనూ.. అంద‌రినీ ఒకే…

7 hours ago