Political News

ఔను… వారు చేయ‌మంటేనే చేశా: రాజ్ క‌సిరెడ్డి!

ఏపీలో వైసీపీ పాల‌న‌లో చీపు లిక్క‌రును మ‌ద్యం బాబుల‌కు అంట‌గ‌ట్టి.. భారీ ధ‌ర‌ల‌తో వారిని దోచేసిన విష‌యం తెలిసిందే. అన్నీ ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాలే కావ‌డం.. ఎక్క‌డా ఫోన్‌పే, గూగుల్ పే వంటి వాటినివినియోగించ‌క‌పోవ‌డం ద్వారా భారీ ఎత్తున న‌గ‌దు అక్ర‌మాలు జ‌రిగాయ‌ని అప్ప‌ట్లోనే ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. దీనిని కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక దుమ్ముదులిపే ప్ర‌య‌త్నం చేసింది. తాజాగా క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి..ఉర‌ఫ్ రాజ్ క‌సిరెడ్డిని పోలీసులు మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌ర‌కు విచారించారు.

వాస్త‌వానికి సోమ‌వారం.. అర్థ‌రాత్రి నుంచి విడ‌త‌ల వారీగా రాజ్ క‌సిరెడ్డిని విచారిస్తూనే ఉన్నారు.. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క విష‌యాలు క‌సిరెడ్డి వెల్ల‌డించిన‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. వీటిలో ప్ర‌ధానంగా నాలుగు అంశాల‌పై అధికారులు దృష్టి పెట్టారు. వైసీపీ హ‌యాంలో తీసుకువ‌చ్చిన మ‌ద్యం విధానానికి రూప‌క‌ర్త ఎవ‌రు? అన్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. దీనికి క‌సిరెడ్డి ఎలాంటి త‌డ‌బాటు లేకుండానే.. వైసీపీ ముఖ్య నాయ‌కులు అని చెప్పిన‌ట్టు తెలిసింది.

ఈ ముఖ్య నాయ‌కుల్లో వైవీ సుబ్బారెడ్డి త‌న‌యుడు విక్రాంత్ రెడ్డి ఉన్న‌ట్టు చెప్పారు. అదేవిధంగా సాయిరెడ్డి పాత్ర కూడా ముఖ్య‌మేన‌ని.. ఆయ‌న ఇప్పుడు త‌ప్పించుకుంటున్నార‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. ఇక‌, డిస్టిల‌రీల వ్య‌వ‌హారం అంతా.. సాయిరెడ్డే చూసిన‌ట్టు చెప్పార‌ని తెలిసింది. కొన్ని కొన్ని విష‌యాల్లో మాత్ర‌మే త‌న ప్ర‌మేయం ఉంద‌ని.. తాడేప‌ల్లి, హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు ల‌లో జ‌రిగిన నాలుగు కీల‌క స‌మావేశాల్లోనే నిర్ణ‌యాలు జ‌రిగాయ‌ని వివ‌రించిన‌ట్టు స‌మాచారం.

డిస్ట‌రీల వ్య‌వ‌హారం స‌హా.. మ‌ద్యం కేసుల విక్ర‌యాలు.. ల‌క్ష్యాలు పెట్ట‌డం.. నిధుల విష‌యం అంతా.. కూడా.. తాడేప‌ల్లికి చెందిన ముగ్గురు కీల‌క వ్య‌క్తులు చెబితేనే తాను చేసిన‌ట్టు క‌సిరెడ్డి వివ‌రించిన‌ట్టు తెలిసింది. ఆ ముగ్గురులో అప్ప‌టి స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూడా ఉన్న‌ట్టు చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది. ఎక్క‌డెక్క‌డ ఏయే మ‌ద్యం విక్ర‌యించాలి. ఎవ‌రిని వాడుకోవాలి.. అనే విష‌యాల్లో ఆయ‌న ప్ర‌మేయం ఉంద‌ని.. అదేవిధంగా అప్ప‌టి ఓ మంత్రి ప్ర‌మేయం కూడా ఉంద‌ని క‌సిరెడ్డి చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇదిలావుంటే.. రాజ్ క‌సిరెడ్డి నుంచి మ‌రిన్ని వివ‌రాలు రాబ‌ట్టిన పోలీసులు కోర్టుకు ఆయ‌న‌ను హాజ‌రుప‌రిచారు.

This post was last modified on April 22, 2025 11:14 pm

Share

Recent Posts

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

1 hour ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

1 hour ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

2 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

2 hours ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

3 hours ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

3 hours ago