Political News

జ‌గ‌న్ విధానాలు మార్చుకోవాల్సిందేనా…

మూడు రాజ‌ధానుల నుంచి మ‌ద్యం వ‌ర‌కు.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ నుంచి స‌చివాల‌యాల వ‌ర‌కు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన ప్ర‌యోగాలు విక‌టించిన విష‌యం తెలిసిందే. ఇవే.. ఆయ‌న‌ను నిలువునా ముంచాయన్నది మేధావుల నుంచి విశ్లేష‌కుల వ‌రకు చెబుతున్న మాట‌. తాను ప‌ట్టిన కుందేలుకు మూడు కాళ్లే అన్న‌ట్టుగా ఆయ‌న అప్ప‌ట్లో వ్య‌వ‌హ‌రించార‌న్న విమ‌ర్శ‌లు తెలిసిందే. ఏరాష్ట్రంలోనూ లేని విధంగా మూడురాజ‌ధానులు తెచ్చారు. దీనిపైకేంద్రం కూడా విస్మ‌యం వ్య‌క్తం చేసింది.

ఇక‌, వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను తెచ్చామ‌ని చెప్పినా.. వారిని పొడిగించ‌ని ఫ‌లితంగా ఇప్పుడు వారికి దిక్కు మొక్కు లేకుండా పోయింది. పైగా ఎన్నిక‌ల స‌మ‌యంలో కీల‌క నాయ‌కుల కంటే కూడా.. వారే ఎక్కువై పోయార‌న్న‌ట్టుగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించారు. ఫ‌లితంగా కార్య‌క‌ర్త‌లు పోయి..వైసీపీని వ‌లంటీర్లు న‌డిపించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇదో పెద్ద మైన‌స్‌గామారి.. ఎక్క‌డికక్క‌డ ఓటు బ్యాంకు చీలిపోయింది. ఫ‌లితంగా వైసీపీ నాశ‌నమైంది.

ఇక‌, మ‌రో రెండు కీల‌క విష‌యాలు.. మ‌ద్య నిషేధం.. చీప్ బ్రాండ్స్‌ను ఎక్కువ ధ‌ర‌లకు విక్ర‌యించ‌డం.. ఈ రెండు కూడా.. విక‌టించాయి. మ‌ద్య‌నిషేధం పేరుతో మంచి చేశామ‌ని జ‌గ‌న్ చెబుతున్నా.. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. ఇక‌, స‌చివాల‌యాల‌ను నిర్మించి.. మంచి చేసినా.. దానివ‌ల్ల కూడా ప్ర‌యోజ‌నం రాబ‌ట్టుకోలేక పోయారు. సొ.. మొత్తంగా జ‌గ‌న్ అనుస‌రించిన విధానాలు వివాదానికి దారితీశాయి. చివ‌ర‌కు ఆ పార్టీకి మైన‌స్ పై మైన‌స్ అయ్యాయి.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. జ‌గ‌న్ త‌న విధానాల‌ను మార్చుకోక త‌ప్ప‌ద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. “ఏం చేస్తారో.. ఏమో.. మా విధానాలు మారాల్సి ఉంది. ఏదీ ఒక్క‌టీ కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. మా నాయకుడు ఆదిశ‌గా అడుగులు వేస్తార‌ని అనుకుంటున్నాం. ఇంకా మూడు రాజ‌ధానుల‌ని మేం ఎలా చెబుతాం“ అని సీనియ‌ర్ నాయ‌కుడు ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు వ్యాఖ్య‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. మార్పు త‌ప్ప‌ద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. సో.. జ‌గ‌న్‌త‌న విధానాల‌ను మార్చుకునే టైం త్వ‌ర‌లోనే ఉంద‌ని కూడా అంటున్నారు. మ‌రి ఏంచేస్తారు..?  కొత్త విధానాలు ఏంటి? అనేది వేచి చూడాలి.

This post was last modified on April 22, 2025 8:09 pm

Share
Show comments
Published by
Kumar
Tags: YCPYS Jagan

Recent Posts

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

28 minutes ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

1 hour ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

2 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

3 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

4 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

4 hours ago