సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీప్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై విపక్ష వైసీపీ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టును ఖండించడంతో పాటుగా.. ఆయనను కూటమి సర్కారే కక్షపూరితంగా అరెస్టు చేయించిందని సంచలన ఆరోపణ చేశారు. అంతేకాకుండా ఈ అరెస్టులకు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ అంబటి ఏకంగా టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడుకు వార్నింగులు జారీ చేశారు. చంద్రబాబుకు వార్నింగ్ ఇస్తూ అంబటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
”ఎంతమందిని అరెస్టు చేస్తారు? అరెస్టు చేసి జైల్లో పెడితే… జైల్లోనే తాము చనిపోతామా? రాదా బెయిల్? ఏడాదికి అయినా వస్తుంది కదా. చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారు, మీరు పెద్ద వారు. 75వ పుట్టిన రోజు జరుపుకున్న మీరు గుర్తు పెట్టుకోండి. దీనికి తగ్గ మూల్యం చెల్లిస్తారు” అంటూ అంబటి సంచలన వ్యాఖ్యలే చేశారు. అసలు పీఎస్ఆర్ ను అరెస్టు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న కుక్కల విద్యా సాగర్ తో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు కోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కోర్టును ఆశ్రయించకుండా ఉన్న కారణంగానే పీఎస్ఆర్ ను అరెస్టు చేయగలిగారు అని ఆయన ఆరోపించారు.
అయినా పీఎస్ఆర్ అరెస్టు చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే జరిగిందని కూడా అంబటి ఆరోపించారు. చంద్రబాబు అరెస్టైన సమయంలో పీఎస్ఆర్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారని, తన అరెస్టులో కీలక భూమిక పీఎస్ఆర్ దేనని చంద్రబాబు భావించారని ఆయన ఆరోపించారు. తన అరెస్టుకు కారకుడిగా నిలిచారన్న భావనతోనే పీఎస్ఆర్ ను చంద్రబాబు అరెస్టు చేయించారన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు కూడా ఓ విషయాన్ని గుర్తించాలని.. టీడీపీ సర్కారే ఎల్లకాలం అధికారంలో ఉండదని ఆయన హెచ్చరించారు. మరో పార్టీ ప్రభుత్వం వస్తే మీ పరిస్థితి ఏమిటని కూడా ఆయన పోలీసులను హెచ్చరించారు. ఐపీఎస్ లు అయినా, ఐఏఎస్ లు అయినా వారి పరిధి దాటి వ్యవహరించరని అంబటి అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం పోలీసుల తీరు అందుకు విరుద్దంగా ఉందని అంబటి ఆరోపించారు.
ఇదిలా ఉంటే… జగన్ కు ఎవరు దగ్గరగా ఉన్నా… వారంతా తమకు శత్రువులే అన్నట్లుగానే చంద్రబాబు భావిస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. అసలు ఏపీలో మద్యం కుంభకోణమే జరగకున్నా.., ఎదో జరిగిందంటూ రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మద్యం విక్రయిస్తే అవినీతి ఎక్కడ జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. అయినా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడితే కదా అవినీతి జరిగేది అని కూడా ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు జరుగుతున్న వాటికంతా చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. చంద్రబాబు లేకుంటే ఆయన కుమారుడు లోకేశ్ అయినా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కూటమి సర్కారు కేవలం 11 నెలల వ్యవధిలో వచ్చిన వ్యతిరేకత దేశంలో ఏ ఒక్క ప్రభుత్వం మీద రాలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న చంద్రబాబు… అందులో భాగంగానే రోజుకు ఒకరిని అరెస్టు చేస్తూ ప్రజల దృష్టిని మరల్చుతున్నారని ఆయన ఆరోపించారు.
This post was last modified on April 22, 2025 3:11 pm
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…