రాజకీయాల్లో తొడ కట్టడం విమర్శలకు గుర్తించడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అయితే అందరూ అలా ఉంటారని కాదు కానీ కొంతమంది నాయకులు తొడగొట్టి రాజకీయాల్లో శఫదాలు చేసిన వారు సవాళ్లు చేసిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ కీలకమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నోరు విప్పితే విమర్శలు వివాదాలు కేంద్రం గా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
వైసీపీలో ఉన్నప్పుడు ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు. జలవనరుల శాఖ మంత్రిగా రెండున్నర సంవత్సరాలు పైగా ఆయన ఉన్నారు. ఈ సమయంలో టిడిపి పై టిడిపి నాయకులపై ఆయన తొడగొట్టి సవాళ్లు చేశారు. అసెంబ్లీలోనే అనేకసార్లు టిడిపి నేతలను కార్నర్ చేసుకుని విమర్శలు గుప్పించారు. అయితే అలాంటి నాయకుడు ఇప్పుడు ఏమయ్యారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అంటే ప్రశ్నలే తప్ప సమాధానం లభించటం లేదు.
దీనికి కారణం ఆయన టీమ్ గా ఉన్న సొంత కుటుంబానికి చెందిన నాయకులు సైతం ఇప్పుడు టిడిపికి వెళ్లిపోయారు. పైగా వారే హవా చాలా ఇస్తున్నారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అసలు ఏ నియోజకవర్గ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అన్నది కూడా ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే గత ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పినా.. ఆ దిశగా ఎక్కడా అడుగులు వేయడం లేదు.
పైగా నరసరావుపేటలో వైసిపి నాయకులు ఎవరు అనిల్ ను తమ నాయకుడిగా ఓం చేసుకోలేకపోయారు. ఇది పెద్ద సమస్య. మరోవైపు నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ పేరు కూడా వినిపించడం లేదు. అంటే అటు నెల్లూరు సిటీలోను ఇటు నరసరావుపేటలోనూ కూడా అనిల్ పేరు ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు అనిల్ కుమార్ రాజకీయాల్లో ఉన్నారా లేరా అనేది కూడా చర్చగా మారింది. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా అనేక వివాదాలు అనేక విషయాలు చర్చకు వచ్చిన ఒక్క విషయం పైన కూడా అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటివరకు స్పందించలేదు.
కనీసం వైసీపీ తరఫున మాట్లాడను కూడా లేదు . ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ రాజకీయాల్లో ఉన్నట్టా లేక ఒక రాజకీయాలకు స్వస్తి చెప్పారా అనేది వైసీపీలోనే నాయకులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఆయన చేసిన దౌర్జన్యాలు అక్రమాలు అనేకం ఉన్నాయని వాటిపై అవసరమైనప్పుడు విచారణ చేస్తామని ఇటీవల మంత్రి నారాయణ నెల్లూరులోనే వ్యాఖ్యానించారు.
దీనిని బట్టి ఏమాత్రం అనిల్ కుమార్ యాక్టివ్ పాలిటిక్స్ చేసినా.. ఆయనపై కేసులు నమోదు కావడం ఖాయమని చర్చ నడుస్తుంది. ఈ కారణంగానే అనిల్ ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. దీంతో తడగొట్టి సవాళ్లు రువ్విన నాయకులకు ప్రజలు మాత్రమే కాదు పార్టీలు కూడా చేరదీయవని, నాయకులు కూడా దూరంగా ఉంచుతారన్న సందేశం ఇచ్చినట్టు అయింది.
This post was last modified on April 21, 2025 9:07 pm
హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్లో…
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం…
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం.. అంతా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇది…