Political News

సాయిరెడ్డిని 3, మిథున్ రెడ్డిని 8 గంట‌లు

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ కుంభ‌కోణంపై కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం.. వ‌రుస పెట్టివైసీపీ కీల‌క నాయ‌కుల‌ను పిలిచివిచారిస్తోంది. దీనిలో భాగంగా విజ‌య‌సాయిరెడ్డిని విచారించిన మ‌ర్నాడే.. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని కూడా పిలిచి విజ‌య‌వాడ‌లో విచారించింది. అయితే.. ఈ విచార‌ణ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌పించింది. అంతా స‌స్పెన్స్‌.. పైగా 8 గంట‌ల సుదీర్ఘ విచార‌ణ‌.(సాయిరెడ్డిని మూడు గంట‌లే విచారించారు). 100కు పైగా ప్ర‌శ్న‌లు. దీంతో మిథున్‌రెడ్డిని ఏం ప్ర‌శ్నించారు? ఏయే అంశాల‌పై కూపీ లాగారు..? అనే విష‌యాలు రాజ‌కీయంగా ఆస‌క్తితో పాటు ఉత్కంఠ కూడా రేపాయి.

జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహిత నాయ‌కుల్లో మిథున్‌రెడ్డి కూడా ఒక‌రు. వ‌రుస విజ‌యాలు సాధించ‌డ‌మేకాదు..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుమారుడు కూడాకావ‌డం.. జ‌గ‌న్‌తో క‌లివిడిగా ఉంటూ.. అన్ని కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామ్యం కావ‌డం.. వంటివి ఈ విచార‌ణ‌కు మ‌రింత ద‌న్నుగా మారింది. సాయిరెడ్డిని విచారించిన మ‌ర్నాడే.. మిథున్‌రెడ్డిని ప్ర‌శ్నించ‌డంతో మ‌రీ ఉత్కంఠ నెల‌కొంది. తాను మిథున్‌రెడ్డికి.. రూ.60 కోట్ల వ‌ర‌కు అప్పులు ఇప్పించాన‌ని సాయిరెడ్డి చెప్పిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. మిథున్‌రెడ్డి, క‌సిరెడ్డి రాజ్‌తో క‌లిసి మ‌ద్యం విధానంపై తాను కూడా చ‌ర్చించాన‌ని ఆయ‌న సిట్‌కు వివ‌రించారు.

ఈ ప‌రిణామాల‌కు తోడు.. మ‌ద్యం విక్ర‌యాల‌న్నీ వైసీపీకి చెందిన నేత‌ల డిస్ట‌ల‌రీ నుంచే జ‌ర‌గ‌డంతో ఈ విచార‌ణ‌కు ప్రాధాన్యం మ‌రింత పెరిగింది. మొత్తంగా 8 గంట‌ల పాటు విజ‌య‌వాడ‌లోని పోలీసు క‌మిష‌న‌ర్ బంగ్లాలో జ‌రిగిన విచార‌ణ‌లో మొత్తం 100కు పైగా ప్ర‌శ్న‌లు సంధించినట్టు తెలిసింది. సాయిరెడ్డి చెప్పిన విష‌యాల‌ను ప్ర‌స్తావించిన‌ప్పుడు.. మిథున్‌రెడ్డి ఆ వ్యాఖ్య‌ల‌ను కొట్టేసిన‌ట్టు తెలిసింది. సాయిరెడ్డి నుంచి అప్పులు ఇప్పించి తీసుకునే ప‌రిస్థితి త‌మ‌కు లేద‌న్నార‌ని స‌మాచారం. తామే ఆఫ్రికా.. ఇత‌ర దేశాల్లో వ్యాపారాలు చేస్తున్నామ‌ని.. మ‌ద్యం వ్యాపారంలో ఎప్పుడూత‌మ జోక్యం లేద‌ని చెప్పిన‌ట్టు తెలిపారు.

ఇక‌, మిగిలి ఎక్కువ ప్ర‌శ్న‌ల‌కు మాత్రం తెలియ‌దు, గుర్తులేదు.. అని స‌మాచారం ఇచ్చిన‌ట్టు తెలిసింది. ముఖ్యంగా సాయిరెడ్డితో క‌లిసి భేటీ అయిన విష‌యంపై అనేక విష‌యాలు మాట్లాడుకుంటామ‌ని.. ఎప్పుడూ త‌ర‌చుగా క‌లుసుకుంటూనే ఉంటామ‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. అంత‌మాత్రాన మ‌ద్యం కోస‌మే మాట్లాడుకునేందుకు క‌లిసిన‌ట్టు భావించ‌రాద‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. క‌సిరెడ్డి రాజ్‌తో త‌న‌కు వ్య‌క్తిగ‌త వ్యాపార సంబంధాలు ఏమీ లేవ‌ని వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది. ఇదిలావుంటే.. విచార‌ణ ముగించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. “నా బెయిల్ పిటిష‌న్ సుప్రీంకోర్టులో విచార‌ణ ప‌రిధిలో ఉంది. ఇలాంటి స‌మ‌యంలో మీడియాతో మాట్లాడ‌రాదు“ అని చెప్పి మిథున్‌రెడ్డి వెళ్లిపోయారు.

This post was last modified on April 20, 2025 11:16 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago