సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యవహారం చూసిన తర్వాత పార్టీలోనే కాదు మామూలు జనాలు కూడా ఇలాగే అనుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో ఆనం కుటుంబం కూడా ఒకటి. ఇప్పటి జనరేషన్ కు బాగా తెలిసిన ఆనం బ్రదర్స్ అంటే ఎవరికైనా వెంటనే ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డే గుర్తుకొస్తారు. ఈమధ్య వివేకా మరణించిన తర్వాత కొంతకాలం రామనారాయణరెడ్డి కామ్ అయిపోయారు. అప్పటికి వాళ్ళు టీడీపీలోనే ఉండేవాళ్ళు. సోదరుని మరణం తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ మాజీ మంత్రి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
2004 నుండి 2014 వరకు నెల్లూరు జిల్లాలో ఆనం బ్రదర్స్ బ్రహ్మాండంగా వెలిగిపోయారు. ఏకదాటిగా రామనారాయణరెడ్డి మంత్రిపదవిలో ఉన్నారంటే ఆనం బ్రదర్స్ ఏ స్ధాయిలో వెలిగిపోయుంటారో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత కూడా కొంతకాలం కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికీ తర్వాత టీడీపీలో చేరిపోయారు బ్రదర్స్. చేరేటపుడు ఏవేవో హామీలు తీసుకున్నా ఆ తర్వాత ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబునాయుడు నెరవేర్చలేదని మండిపడేవారు. ఈ కారణంగానే ఇద్దరూ వైసీపీలో చేరాలని అనుకున్నారు.
అయితే వీళ్ళ వైఖరి బాగా తెలిసిన కారణంగా జిల్లాలోని వైసీపీ నేతలెవరు వీళ్ళను పార్టీలో చేర్చుకోవటానికి ఇష్టపడలేదు. దాంతో వీళ్ళపై ప్రత్యేకమైన అభిమానం అంటూ ఏమీ లేని జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళ చేరికను పక్కనపెట్టేశారు. దాంతో ఇష్టం ఉన్నా లేకపోయినా వేరే దారి లేక టీడీపీలోనే కంటిన్యు అయ్యారు. ఈ దశలోనే అనారోగ్యంతో వివేకా మరణించారు. కొంతకాలం అజ్ఞాతంలో గడిపిన మాజీమంత్రి మళ్ళీ వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసుకున్నారు.
అయితే ఈయనపై సానుభూతి కారణంగా నేతలు ఓకే చెప్పటంతో జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఎన్నికలకు ముందు పార్టీలో చేరి వెంకటగిరి ఎంఎల్ఏగా పోటీ చేసి గెలిచారు. ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుండే రామనారాయణరెడ్డిలో అసంతృప్తి మొదలైంది. ఎందుకంటే జిల్లాలోనే సీనియర్ అయిన తనను మంత్రివర్గంలోకి తీసుకోలేదని అలిగారు. నిజానికి ఈయన్ను పార్టీలోకి చేర్చుకోవటమే ఎక్కువంటే పైగా టికెట్ కూడా ఇచ్చారు జగన్. తాను ఏ పరిస్ధితుల్లో వైసీపీలో చేరాననే విషయాన్ని మరచిపోయినట్లున్నారు.
టీడీపీలో ఉన్నపుడు కూడా ఇంతే. ఎంతసేపు తనకు ఎంఎల్సీ పదవి ఇచ్చి వెంటనే మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న డిమాండే వినిపించేవారట. వీళ్ళకన్నా ముందునుండే పార్టీలో ఉన్న నేతలు, గెలిచిన నేతలను పక్కన పెట్టేయాలని వీళ్ళు ఎలా అనుకుంటున్నారో అర్ధం కావటం లేదని అప్పట్లో టీడీపీలోనే చర్చ జరిగేది. ఇపుడు ఇదే చర్చ వైసీపీలో మొదలైంది. వైసీపీ కష్టకాలంలో ఉన్నపుడు పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళని కాదని వేరే దారిలేక వైసీపీలో చేరి గెలిచిన మాజీమంత్రిని మళ్ళీ మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోవాలన్నది అధికార పార్టీ నేతల వాదన. ఏదేమైనా తనలోని అసంతృప్తిని నోటికొచ్చినట్లు మాట్లాడటం ద్వారా కొన్నిసార్లు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం ద్వారా కొన్నిసార్లు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈయన అసంతృప్తి జగన్ ఏమి మందు వేస్తారో చూడాల్సిందే.
This post was last modified on November 2, 2020 12:05 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…