Political News

జ‌గ‌న్‌కు సౌండ్ లేకుండా చేసిన చంద్ర‌బాబు!

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌కు సీఎం చంద్ర‌బాబు సౌండ్ లేకుండా చేశారు. గుడ్ ఫ్రైడేను పుర‌స్క రించుకుని క్రిస్టియ‌న్లు ఘ‌నంగా నిర్వ‌హించుకునే.. గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించేందుకు.. జ‌గ‌న్ రెడీ అయ్యారు. దీనికి సంబంధించి పార్టీ నాయ‌కుల‌ను కూడా రెడీ చేశారు. త‌మ హ‌యాంలో పాస్ట‌ర్ల‌కు, మ‌తాచార్యుల‌కు నెల నెలా పింఛ‌ను రూపంలో గౌర‌వ వేత‌నం ఇచ్చామ‌ని.. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. దానిని ఎత్తేశార‌ని వారికి చెప్పాల‌ని నిర్ణ‌యించారు.

అయితే.. తాజాగా కూట‌మి స‌ర్కారు ఈ విష‌యంలో జ‌గ‌న్‌కు భారీ షాక్ ఇచ్చింది. తాజాగా స‌ర్కారు ఉత్త ర్వులు జారీ చేసింది. పాస్ట‌ర్ల‌కు.. క్రిస్టియ‌న్ మ‌తాచార్యుల‌కు.. రూ.5000 చొప్పున పింఛ‌ను, లేదా గౌర‌వ వేత‌నాన్ని పున‌రుద్ధ‌రిస్తున్న‌ట్టు పేర్కొంది. అంతేకాదు.. 2024కు ముందు.. వైసీపీ అమ‌లు చేసిన దీనిని మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలిపింది. అక్క‌డితో కూడా ఆగ‌కుండా.. గ‌త ఏడాది మే నుంచి నవంబర్ వ‌ర‌కు లెక్క‌గ‌ట్టి.. సొమ్ములు ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపింది.

అంటే.. సుమారు 7 మాసాల కాలానికి రూ.5000 చొప్పున శుక్ర‌వారం(గుడ్ ఫ్రైడే) నాడు ఈ సొమ్మును ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. ఒక్కొక్క పాస్ట‌ర్‌(ల‌బ్ధిదారులైన‌వారు, ప్ర‌భుత్వ జాబితాలో ఉన్న‌వారు) రూ.35 వేల చొప్పున అందుకోనున్నారు. ఈ మేర‌కు తాజాగా ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి రూ.30 కోట్ల‌ నిధుల‌ను కూడా విడుద‌ల చేసిన‌ట్టు తెలిపింది. దీంతో జ‌గ‌న్ అండ్ టీమ్‌కు సౌండ్ లేకుండా పోయింది.

వాస్త‌వానికి వైసీపీ హ‌యాంలో ప్రారంభ‌మైన ఈ ప‌థ‌కాన్ని ఆపేయాల‌ని కూట‌మి కుట్ర చేసిందంటూ.. ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌చారం చేయాల‌నిఅనుకున్న స‌మ‌యంలో చంద్ర‌బాబు స‌ర్కారు ఊహించ‌ని విధంగా నిర్ణ‌యం వెలువ‌రించ‌డంతో జ‌గ‌న్‌కు సౌండ్ లేకుండా పోయింద‌ని కూట‌మి నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. 

This post was last modified on April 17, 2025 10:09 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

ఆగకుండా ఆగమాగం చేస్తున్న దురంధర్

దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…

8 hours ago

సహానా సహానా… అంచనాలు అందుకున్నానా

రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…

9 hours ago

షర్మిలకు బాబు, పవన్, లోకేష్ విషెస్… మరి జగన్?

చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…

11 hours ago

‘సింపతీ కార్డ్’పై నాగవంశీ కౌంటర్

సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…

14 hours ago

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సంచలన నిర్ణయం

తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…

14 hours ago

కొత్త రిలీజుల తాకిడి… అవతారే పైచేయి

అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…

15 hours ago