ఏపీ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ వైఖరి చాలా భిన్నంగా ఉందని, ఆయన రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని, పైగా పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో అంచనా వ్యయాలకు భారీగా కోత పెడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో రాజకీయాల మాట ఎలా ఉన్న ప్పటికి.. మేధావులు, తటస్థ వైఖరిని అవలంభించే వారు కూడా ఒకింత ఖిన్నులవుతున్నారు. ఏపీ విషయంలో ఇంత అన్యాయం చేస్తారా? అంటూ.. ఆగ్రహావేశాలను కూడా ప్రదర్శిస్తున్నారు. నిజమే.. కేంద్రం వైఖరిని చూస్తే.. ఇలానే అనిపిస్తుంది.
గతంలో ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను అటకెక్కించారు.. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లను వెనక్కి తీసుకున్నారు(గత సర్కారు హయాంలోనే). ఇక, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అంచనాలను కూడా కుదించేశారు. ఇవన్నీ చూస్తే.. విభజనతో ఇప్పటికే తీవ్ర ఇక్కట్లలో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నుంచి సమ్మెటపోట్లు పడుతున్నాయని అనిపిస్తుంది. మరి ఎందుకు ఇలా జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ఇలా చేస్తున్నారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి రాజకీయ నేతలు ఏవేవో.. కారణాలు చూపిస్తున్నారు. సరే..! అని నిజమో కావో వారికీ తెలియదు.
కానీ, తాజాగా ఇదే విషయంపై జాతీయస్థాయిలో మేధావులు కొన్ని ఆధారాలు చూపిస్తూ.. మోడీ అందుకే ఏపీని పక్కన పెట్టారు! అని చెబుతున్నారు. ఆ కారణాలు ఏంటంటే.. మోడీ స్వతహాగా.. ఎవరికీ ఏమీ ఉచితంగా ఇచ్చే టైపు కాదు. రాజకీయాల్లో గెలుపు గుర్రం ఎక్కేందుకు కూడా ఆయన ఎక్కడా ఏమీ ఉచితంగా ప్రవేశపెట్టిన పథకాలు గుజరాత్‌లోనూ మనకు కనిపించవు. ప్రజలను సోమరులుగా మార్చాలని ఆయన అనుకోరు. ఈ క్రమంలోనే ఆయన ప్రజల కోసం ఏం చేసినా.. దానిలో ప్రజల కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది.
ఆర్థికంగా ప్రజలు వారి కాళ్లపై వారు ఎదగాలని కోరుకునే వ్యక్తుల్లో మోడీ కీలక నాయకుడు. అందుకే ఆయన ఏ పథకం పెట్టినా.. ప్రజలకు ఉచితంగా ఇవ్వకుండా.. భాగస్వామ్యులను చేస్తారు. ప్రధాని జన్‌ధన్ యోజన, ఉజ్వల్, సుకన్య ఇలాంటి అన్ని పథకాల్లోనూ ప్రజల బాగోగులు కోరుకున్నా.. నేరుగా వారికి ప్రజాధనం పందేరం చేయలేదు. కానీ, ఏపీలో జగన్ మాత్రం ప్రజలకు పందేరం చేస్తుండడం.. ఇక్కడ ప్రజలకు ఉచితంగా డబ్బులు పంచడం, ప్రజలను నైపుణ్యాలవైపు నడిపించకపోవడం వంటివి మోడీకి సుతరామూ ఇష్టం లేదనేది మేధావుల మాట.
అయితే, ఈ విషయాన్ని మోడీ ఎక్కడా నేరుగా చెప్పడం లేదు. ఇంతగా అంటే ఏపీ ప్రభుత్వమే తాము 70 వేల కోట్లు ప్రజలకు పంచామని ప్రచారం చేస్తున్న దరిమిలా.. డబ్బున్న రాష్ట్రంగానే మోడీ భావిస్తున్నారని అంటున్నారు. అందుకే తాను తీసుకునే నిర్ణయాలు తాను తీసుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి ఏపీ విషయంలో మోడీ వైఖరి వెనుక జగన్ అనుసరిస్తున్న వ్యూహమే ఉందని ఆధారాలతో సహా వివరిస్తున్నారు. సో.. ఇదీ సంగతి! ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి!!
This post was last modified on November 2, 2020 8:25 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…