టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు..ఢిల్లీ నుంచి విదేశీ విమానం ఎక్కనున్నారు. ఫలానా దేశం అని తెలియదు గానీ.. యూరోప్ లోని పలు దేశాల్లో చంద్రబాబు తన ఫ్యామిలీతో కలిసి దాదాపుగా ఆరు రోజులు సరదాగా గడపనున్నారు. చంద్రబాబు టూర్ పై ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటనను విడుదల చేసింది. యూరోప్ పర్యటనను ముగించుకుని చంద్రబాబు ఈ నెల 22న ఢిల్లీ చేరుకునే చంద్రబాబు.. 23న కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత విజయవాడ చేరుకుంటారు.
ఏంటీ?.. నిజమా?.. అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే… ఎప్పుడు విదేశాలకు వెళ్లినా ఏదో అధికారిక కార్యక్రమాల కోసమే గానీ… ఫ్యామిలీతో సరదాగా చంద్రబాబు విదేశీ యానం చేసిన దాఖలాలు చాలా తక్కువ.
అయినా ఇప్పుడు చంద్రబాబు ఫారిన్ టూర్ ఎందుకు అనుకుంటున్నారా? ఇంకెందుకండీ బాబూ… ఈ నెల 20న చంద్రబాబు జన్మదినం కదా. ఈ జన్మదినం చంద్రబాబుకు అత్యంత ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే… చంద్రబాబు జన్మించి ఈ నెల 20 నాటికి సరిగ్గా 75 ఏళ్లు పూర్తి కావస్తున్నాయి. అంటే.. తన 75వ జన్మదినాన్ని ఎలాంటి ఒత్తిడి, అధికారిక హడావిడి లేకుండా కేవలం కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా.. తన డైమండ్ జూబ్లీ జన్మదినాన్ని జరుపుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారన్న మాట. నిత్యం బిజీగా ఉండే చంద్రబాబుకు ఈ మాత్రం సంతోషాలు ఉండి తీరాల్సిందే.
4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్న చంద్రబాబు… తన జీవితంలో కుటుంబ సభ్యుల కంటే కూడా జనంతోనే ఆయన ఎక్కువ కాలం గడిపి ఉంటారు. విద్యాభ్యాసం అయిన వెంటనే రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు.. తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే మంత్రిగా కూడా పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత ఓ ఐదేళ్లు మినహాయిస్తే.. ఉంటే సీఎంగా, లేదంటే ప్రధాన ప్రతిపక్ణ నేతగా సాగుతున్న చంద్రబాబు నిజంగానే జనంతో అధిక కాలం గడిపి ఉంటారు. మొన్నటిదాకా జనంతోనే మమేకం అియిన బాబు.. ఈ మధ్యనే కాస్తంత సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ చంద్రబాబుకు మంచి అనుభూతిని ఇస్తుందని చెప్పొచ్చు.
This post was last modified on April 16, 2025 8:34 am
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఏడాది జనసేన పార్టీ విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. సీమలో బలమైన బలిజ…
టాలీవుడ్లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే క్వాలిటీ, వెరైటీ చూపించే హీరో నాని. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం.. ఇలా ఏడాదిన్నర వ్యవధిలో…
నిలకడలేని మాటలు… నిబద్ధత లేని వ్యవహారాలకు కేరాఫ్గా మారిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 24 గంటల్లో మాట మార్చేశారు.…
'ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఛాన్స్ ఇవ్వట్లేదు కానీ.. ఇస్తేనా?' ఇదీ.. సీఎంవోలో వినిపిస్తున్న మాట. దీనికి కారణం..…
నిన్న తెలుగులో రెండు సినిమాలు రిలీజయ్యాయి. ఒకటి సారంగపాణి జాతకం. మరొకటి అలిపుజ జింఖానా. పర్వాలేదు నుంచి బాగానే ఉన్నాయనే…
ఇంకో అయిదు రోజుల్లో విడుదల కాబోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ కి కౌంట్ డౌన్ మొదలైపోయింది. బుక్…