Political News

తాను చెడి.. పార్టీని చెరిపి..

గోరంట్ల మాధ‌వ్‌. 2022లో జోరుగా వినిపించిన పేరు. హిందూపురం వైసీపీ ఎంపీగా అప్ప‌ట్లో ఆయ‌న న్యూడ్ వీడియో ఆరోపణల తో అడ్డంగా దొరికిపోయారు. అయితే.. దీనిని స‌మ‌ర్థించుకునేందుకు నానా పాట్లు ప‌డ్డారు. ఇక‌, బీసీ నాయ‌కుడు కావ‌డం.. తాను ఏరికోరి పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేయించి.. పార్టీలో చేర్చుకున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ కూడా.. ఆయ‌న‌ను చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. ఫ‌లితంగా వైసీపీకి మ‌హిళా ఓటు బ్యాంకుదూర‌మైంది. అయితే.. ఇప్ప‌టికీ గోరంట్ల తీరు మార‌లేదు.

తాజాగా టీడీపీ స‌స్పెండ్ చేసిన చేబ్రోలు కిర‌ణ్.. జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తిపై దూష‌ణ‌లు చేశాడ‌ని తెలియ డంతో ఆయ‌న‌పై దాడి చేసేందుకు గోరంట్ల హిందూపురం నుంచి హుటాహుటిన విజ‌య‌వాడ‌కు చేరుకుని.. ర‌చ్చ ర‌చ్చ చేశారు. ఇది కిర‌ణ్ కంటే.. గోరంట్ల‌కే పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయింది. కిర‌ణ్ ను కొట్టే స‌మ‌యంలో పోలీసుల‌పై దాడికి పాల్ప‌డ్డారంటూ.. ఆయ‌న‌పై కేసుపెట్ట‌డంతో ప్ర‌స్తుతం రాజ‌మండ్రి జైల్లో ఉన్నారు.

ఇక‌, గుంటూరు కోర్టులో హాజరుపర్చే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. దీనిపై విచారణకు గుంటూరు సౌత్‌ డీఎస్పీ భానోదయను నియమించారు. మాధవ్‌ను జీజీహెచ్‌లో వైద్య పరీక్షలకు తీసుకెళ్లినప్పడు అక్కడ ఆయన ఫోన్‌లో మాట్లాడినా బందోబస్తు సిబ్బంది అడ్డు చెప్పలేదు. మీడియా ముందు ప్రవేశపెట్టే ముందు ముసుగు వేసుకోవటానికి నిరాకరించి, తనకే ముసుగు వేస్తారా? అంటూ పోలీసులపై కన్నెర చేశారు.

ఇక‌, కోర్టు వద్ద పోలీస్‌ వాహనంలోంచి దిగి నేరుగా న్యాయస్థానంలోకి వెళ్లిపోయారు. ఇవన్నీ పోలీసుల వైఫల్యమేనని ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో ఆ రోజు బందోబస్తు విధుల్లో ఉన్న సీఐ, ఎస్సైలు, సిబ్బంది నుంచి డీఎస్పీ భానోదయ వాంగ్మూలాలు నమోదు చేశారు. కస్టడీలో ఉన్న వ్యక్తికి మరో వైఎస్సార్సీపీ నాయకుడు ఫోన్‌ తీసుకొచ్చి ఇచ్చినా అక్కడున్న పోలీసులు పట్టించుకోకపోవడంపైనా ఆరా తీసి.. సుమారు ప‌ది మంది పోలీసుల‌ను స‌స్పెండ్ చేశారు. ఏతా వాతా ఈ కిర‌ణ్ ఘ‌ట‌న‌లో గోరంట్ల దూకుడు.. ఆయ‌న‌కే కాకుండా.. పార్టీకి.. పోలీసుల‌కు కూడా.. చిచ్చు పెట్టిన‌ట్టు అయిందన్న చ‌ర్చ సాగుతోంది.

This post was last modified on April 14, 2025 10:58 am

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

1 hour ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago