తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సతీమణి, ఇటాలియన్ అన్నాలెజెనోవో తిరుమల సంప్రదాయాలకు పెద్దపీట వేశారు. విదేశాలకు చెందిన వారు, ఇతర మతాలను ఆచరించేవారు.. తిరుమలకు వచ్చినప్పుడు ఎలాంటి సంప్రదాయాలు పాటించాలో ఖచ్చితంగా వాటిని ఆమె పాటించారు. కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్రిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. దీంతో శ్రీవారికి మొక్కుకున్న అన్నా లెజెనోవా.. మార్క్ శంకర్ కోలుకోవడంతోపాటు.. సురక్షితంగా ఇంటికి రావడంతో మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చారు.
ఈ క్రమంలో తొలుత తిరుపతిలోనే ఆమె డిక్లరేషన్(శ్రీవారిని విశ్వసిస్తున్నాను. ఆయనపై నమ్మకం ఉంది అని పేర్కొంటూ.. చేసే సంతకం. గతంలో జగన్ ఈ విషయంలోనే ఇరుకుపడ్డారు) పై సంతకం చేశారు. అనంతరం.. నేరుగా ఆమె తిరుమలకు వెళ్లి శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తొలుత గాయత్రి నిలయం అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు..ప్రొటోకాల్ ప్రకారం.. అధికారులు స్వాగతం పలికారు. అనంతరం.. ఆమె కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం.. భూవరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
ఆ తర్వాత కల్యాణ కట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించారు. ఆదివారం రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న అన్నా లెజెనోవా.. సోమవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటారు. అనంతరం.. తరిగొండ వెంగమాంబ సత్రంలో భోజనాలను వడ్డించనున్నారు. అక్కడే ఆమె కూడా భోజనం చేయనున్నారు. మొక్కు చెల్లించుకోవడంలో భాగంగానే అన్నా లెజెనోవా.. తిరుమలకు వచ్చారని జనసేన పార్టీ తెలిపింది. కాగా.. ఆమె పర్యటనలో జనసేన కార్యకర్తలు, నాయకులు ఎవరూ పాల్గొనరాదని.. పార్టీ నిర్దేశించడంతో ఆమె వెంట కొందరు అధికారులు మాత్రమే ఉన్నారు.
This post was last modified on April 14, 2025 11:06 am
నిలకడలేని మాటలు… నిబద్ధత లేని వ్యవహారాలకు కేరాఫ్‌గా మారిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 24 గంటల్లో మాట మార్చేశారు.…
'ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఛాన్స్ ఇవ్వట్లేదు కానీ.. ఇస్తేనా?' ఇదీ.. సీఎంవోలో వినిపిస్తున్న మాట. దీనికి కారణం..…
నిన్న తెలుగులో రెండు సినిమాలు రిలీజయ్యాయి. ఒకటి సారంగపాణి జాతకం. మరొకటి అలిపుజ జింఖానా. పర్వాలేదు నుంచి బాగానే ఉన్నాయనే…
ఇంకో అయిదు రోజుల్లో విడుదల కాబోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ కి కౌంట్ డౌన్ మొదలైపోయింది. బుక్…
జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో ఉగ్రవాద దాడి జరుగుతుందని పాకిస్థాన్‌కు ముందే తెలుసా? ఈ దాడి పరిణామాల…
ఏపీలో పెను కలకలమే రేపుతున్నమద్యం కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పరిగణిస్తున్న ఏపీ ప్రభుత్వ…