“ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్ భరతం పట్టేందుకే.. నేను రాజకీయ నాయకుడిగా మారుతున్నా. జగన్‌కు చుక్కలు చూపిస్తా. ఎవరైనా జగన్ గురించి ఫిర్యాదు చేయాలని అను కుంటే.. నిర్భయంగా 7816020048 వాట్సాప్ నంబర్ కు సమాచారం పంపండి. నేను మీకు అండగా ఉంటా. అందరం కలిసి జగన్ భూతాన్ని జైల్లో పెడదాం” అని ఏపీకి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి.. ఆలూరి బాల వెంకటేశ్వరరావు (ఏబీవీ) తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత వైసీపీ హయాంలో ఆయనను సీఎం జగన్ వేధించారని.. తన ఐదేళ్ల సర్వీసును దెబ్బతీసి.. అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. చివరకు క్యాట్‌లో పోరాడి ఆయన తిరిగి ఉద్యోగం పొందినా.. వైసీపీ హయాంలో ఆయనకు పోస్టింగు ఇచ్చినట్టే ఇచ్చి.. మళ్లీ సస్పెండ్ చేశారు. ఇలా.. వైసీపీ హయాంలో అనేక అవమానాలు పొందిన ఆయన చివరకు రిటైర్మెంటు రోజు పోస్టింగ్ పొంది.. ఇలా వచ్చి అలా రిటైర్ అయ్యారు. కాగా.. ప్రస్తుతం ఆయనను చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. పైగా.. వైసీపీ హయాంలో సస్పెండ్ అయిన కాలానికి సంబంధించిన వేతనా లు.. బకాయిలు కూడా.. వడ్డీ వేసి మరీ చెల్లించడం గమనార్హం.
తాజాగా ఏం జరిగింది?
ఆదివారం సాయంత్రం కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి వచ్చిన ఏబీవీ.. గతంలో జగన్‌పై కోడికత్తి తో దాడి చేసి.. జైలు పాలై.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. తాను కూడా అండగా ఉంటానని ఆయన చెప్పారు. అనంతరం ఏబీవీ మీడియాతో మాట్లాడారు. “రాజకీయాల్లోకి ఎప్పటికైనా రావడం అవసరం అనిపించింది. ఇప్పుడే.. ఈ క్షణం నుంచే రాజకీయాల్లోకి వస్తున్న. మెరుగైన సమాజం కోసం పాటుపడేందుకే వస్తున్నా.“ అని వ్యాఖ్యానించారు. ఇదేసమయంలో జగన్ అక్రమాలను వెలికి తీస్తానని.. జగన్ భరతం పడతానని ఏబీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“జగన్ పైకి కనిపించేంత సౌమ్యుడు కాదు. పక్కా దుర్మార్గుడు. ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వీటిని బయటకు తెస్తా. కోడికత్తి శ్రీను లాంటి జగన్ బాధితులు వందలు, వేలల్లో ఉన్నారు. వాళ్లందరికీ అండగా ఉంటా. నా రాజకీయ ప్రయాణాన్ని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలి. నేను ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే వెల్లడిస్తా. ఏ పదవినీ ఆశించి రాజకీయాలు చేయను. కేవలం జగన్ భరతం పట్టేందుకు.. మెరుగైన సమాజంలో ఇలాంటి వారిని ఏరేసేందుకు వస్తున్నా“నని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పై ఫిర్యాదు చేయాలని అనుకునే వారికి ప్రత్యేకంగా 7816020048 వాట్సాప్ నంబర్ ఇచ్చారు. నిర్భయంగా ఈ నెంబరు కు ఎలాంటి సమాచారన్నయినా పంచుకోవచ్చన్నారు. తాను గోప్యంగా ఉంచుతానని చెప్పారు.
This post was last modified on April 13, 2025 10:29 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…