ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి ఐజీ అశోక్ కుమార్ శనివారం ఓ విస్పష్ట ప్రకటన చేశారు. ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదం కారణంగానే చనిపోయారని ఐడీ స్పష్టం చేశారు. అతిగా మద్యం సేవించి… ఆ మత్తులోనే వేగంగా వాహనాన్ని నడుపుతున్న క్రమంలో ప్రవీణ్ మూడు సార్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, ఈ క్రమంలోనే ఆయన చనిపోయారని ప్రకటించారు. ఈ విషయంలో ఇప్పటిదాకా పలు రకాలుగా ప్రవీణ్ మరణాన్ని వివాదాస్పదం చేసేలా ప్రకటనలు చేసిన వారితో పాటుగా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి నోటీసులు జారీ చేసినట్లు కూడా ఐజీ ప్రకటించారు. ప్రవీణ్ పగడాలది ముమ్మాటికీ రోడ్డు ప్రమాదం కారణంగా జరిగిన మరణమేనని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని కూడా ఆయన తేల్చి చెప్పారు. ప్రవీణ్ ను హత్య చేశారన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఈ మేరకు శనివారం రాజమహేంద్రవరంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐజీ అశోక్ కుమార్… ప్రవీణ్ పగడాల మృతికి దారి తీసిన అన్ని పరిస్థితులను సవివరంగా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి బైక్ పై బయలుదేరిన ప్రవీణ్ పగడాల ఈ విషయాన్ని తన కుటుంబానికి తప్పించి మరో వ్యక్తికి తెలపలేదని చెప్పారు. మార్గమధ్యంలో రెండు చోట్ల ఆగిన ప్రవీణ్… ఆ రెండు ప్రాంతాల్లోని వైన్ షాపుల్లో డిజిటల్ పే మెంట్లు చేశారని తెలిపారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో పలు మార్లు ఆగిన ప్రవీణ్… ఆరుగురు వ్యక్తులతో సంభాషించారని తెలిపారు. ఈ విషయాలను తాము ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ధృవీకరించుకున్నామని తెలిపారు. ఇక ప్రవీణ్ తన ప్రయాణంలో మద్యం సేవించారని, అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఐజీ తెలిపారు.
ఇక ప్రవీణ్ పగడాల మృతదేహానికి చేసిన పోస్టుమార్టం నివేదిక కూడా వచ్చిందని… అందులోనూ రోడ్డు ప్రమాదం కారణంగానే ప్రవీణ్ చనిపోయినట్లు తేలిందని ఐజీ తెలిపారు. విచారణలో భాగంగా ప్రవీణ్ కుటుంబ సభ్యులతో పాటుగా ఆయా ప్రాంతాలకు చెందిన దాదాపుగా 113 మందిని విచారించామని తెలిపారు. ప్రవీణ్ ప్రయాణించిన దూరంలో ఉన్న దాదాపుగా అన్ని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి విచారణ సాగించామని తెలిపారు. ప్రవీణ్ ఆగిన ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా విచారణ సాగించామని తెలిపారు. విచారణలో ఏ ఒక్కరు కూడా ప్రవీణ్ మృతిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని తెలిపారు. చివరకు ప్రవీణ్ కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదన్నారు. ఈ మొత్తం విచారణలో ప్రవీణ్ హత్యకు గురయ్యారన్న చిన్న క్లూ కూడా లభించలేదని, రోడ్డు ప్రమాదం కారణంగానే ఆయన చనిపోయారని తేలిందని ఐజీ చెప్పారు.
This post was last modified on April 12, 2025 12:34 pm
ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి…
మ్యాన్‌హోల్‌లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ…
రాజకీయాల్లోకి అఖిల భారత ఉద్యోగులు రావడం సహజం అయిపోయింది. ఉద్యోగాలు విరమణ చేసిన వారు కొందరు.. మధ్యలోనే పీక్ స్టేజ్‌లో…
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అనే లవకుశ పాట టాలీవుడ్ కు అచ్చంగా సరిపోతుంది. కొన్ని కాంబినేషన్లు రూపొందే…
దర్శకుడు ప్రశాంత్ వర్మకి హనుమాన్ కన్నా ముందు కమర్షియల్ గా బ్రేక్ ఇచ్చిన సినిమా జాంబీ రెడ్డి. అప్పటిదాకా టాలీవుడ్…
ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ రూపంలో ఒక్కసారి బ్రేక్ దక్కిందంటే ఆ దర్శకుడి సుడి మాములుగా తిరిగదు. వెంకీ అట్లూరి పరిస్థితి…