సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ మొన్న సింగపూర్ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటపై ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ రంగ ప్రముఖులు… చివరాఖరుకు పవన్ పై నిత్యం విరుచుకుపడే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా విచారం వ్యక్తం చేస్తూ ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని, కష్టకాలంలో ఉన్న పవన్ కుటుంబానికి సాంత్వన చేకూరాలని కోరారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఓ వ్యక్తి పవన్ కుమారుడిపై అనుచిత పోస్టు పెట్టాడు. దీనిపై వేగంగా స్పందించిన ఏపీ పోలీసులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఆ పోస్టుపై స్పందించిన వారిపైనా కేసులు బుక్కయ్యాయి. అంతేకాకుండా… వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
మార్క్ శంకర్ కేవలం ఏడున్నరేళ్ల బాలుడు. అభంశుభం తెలియని ఆ బాలుడు సమ్మర్ వెకేషన నిమిత్తం సింగపూర్ వెళ్లాడు. ఈ క్రమంలో సమ్మర్ వెకేషన్ కోర్సులను నిర్వహిస్తున్న సింగపూర్ పాఠశాలలో మంగళవారం ఉదయం ఉన్నట్లుండి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 30 మంది పిల్లలున్న సదరు పాఠశాలలో ఓ చిన్నారి బాలిక చనిపోవడంతో పాటుగా 15 మంది పిల్లలు గాయపడ్డారు. ఈ ఘటనలో మార్క్ శంకర్ కు కూడా గాయాలయ్యాయి. కాళ్లు, చేతులకు కాలిన గాయాలయ్యాయి. అగ్ని కీలల కారణంగా ఎగసిన పొగను పీల్చుకున్న శంకర్ శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఘటన అందరిలోనూ ఆందోళన రేకెత్తింది. అయితే దేవుడి దయ వల్ల మార్క్ శంకర్ మూడు రోజు సాయంత్రం… అంటే గురువారం సాయంత్రానికంతా ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం అతడు ప్రమాదం నుంచి బయటపడ్డా… ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో పవన్ అడవి తల్లి బాట కార్యక్రమం నిమిత్తం అరకు పరిధిలోని గిరిజన గ్రామాల్లో పర్యటిస్తున్నారు కుమారుడికి అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయని తెలిసినా కూడా పవన్.. తన గిరిజన గ్రామాల పర్యటనను ముగించుకున్న తర్వాతే సింగపూర్ వెళ్లారు. ఇలాంటి క్రమంలో అగ్ని ప్రమాదంలో గాయపడ్డ పవన్ కుమారుడు మార్క్ శంకర్ బతకడని, అతడు చనిపోతాడని, ఈ మాట పక్కా అంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వికృతానందనం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టు తప్పు అని చెప్పాల్సిన మరింత మంది వ్యక్తులు సదరు పోస్టులోని మాటలు కరెక్టేనంటూ కామెంట్లు పెట్టారు. ఈ పోస్టు నిజంగానే జనసేన శ్రేణుల్లోనే కాకుండా యావత్తు జనం అంతటిలోనూ ఆగ్రహావేశాలను రేకెత్తించింది. చివరాఖరుకు ఈ పోస్టు గురించిన సమాచారం అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రాథమిక పోస్టును పెట్టిన వ్యక్తితో పాటుగా ఆ పోస్టును సపోర్ట్ చేస్తూ రీట్వీట్లు చేసినవారు, కామెంట్లు చేసిన వారిపైనా పోలీసులు కేసులు పెట్టారు. అంతటితో ఆగని పోలీసులు… ఈ ఘటనను సీరియస్ గా పరిగణించి పోస్టులు పెట్టిన వాడితో పాటుగా దానిని సమర్థించిన వారందరినీ అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగారు.
This post was last modified on April 12, 2025 8:56 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…