వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైైరల్ అవుతోంది. ఐటీటీడీపీ బహిష్కృత యాక్టివిస్ట్ చేబ్రోలు కిరణ్ కుమార్ పై గోరంట్ల మాధవ్ దాడి చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఏకంగా పోలీసు వాహనాన్ని ఆపి మరీ ఆ వాహనంలో నుంచి కిరణ్ ను బయటకు లాగేందుకు యత్నించిన మాధవ్.. అది సాధ్యం కాకపోవడంతో.. జీపులోనే కూర్చున్న కిరణ్ ను జీపు బయటే ఉండి మాధవ్ భౌతిక దాడి చేశారు ఈ సందర్భంగా యూనిఫామ్ లో ఉన్న ఓ పోలీసు, మఫ్టీలో ఉన్న మరో పోలీసుతో పాటు ఇద్దరు అనుచరులు నిలువరించే యత్నం చేసినా మాధవ్ దూసుకెళుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి,.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిప అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కిరణ్ ను టీడీపీ బహిష్కరించింది. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. అన్నీ చట్టబద్ధంగానే జరుగుతుండగా… మాధవ్ ఎంట్రీ ఇచ్చి కిరణ్ పై దాడి చేసి ఈ వ్యవహారాన్ని రచ్చ రచ్చ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసుల అదుపులోని నిందితుడిపై దాడి చేయడం అంటే… తీవ్రమైన నేరంగానే పరిగణించాలి. అది కూడా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రదాన గేటు సమీపంలో జరిగిన ఈ ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
రాజకీయాల్లోకి రాకముందు గోరంట్ల మాధవ్ ఓ పోలీసు అధికారిగా.. పోలీసు అధికారుల సంఘం ప్రతినిధిగా, ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు. నాడు ఓ పోలీసు శాఖపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయగా… వాటికి కౌంటర్ ఇచ్చిన మాధవ్ ఒక్కసారిగా హీరో అయిపోయారు. ఆపై జగన్ నుంచి పిలుపు అందుకున్న మాధవ్ ఏకంగా రాజకీయాల్లోకి వచ్చేసి హిందూపురం ఎంపీగా విజయం సాధించి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టారు. ఐదేళ్లు ఎంపీగా పనిచేశారు. అయినా కూడా ఓ వీధి రౌడి మాదిరిగా పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడికి యత్నించిన మాధవ్ తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చిపడుతున్నాయి.
This post was last modified on April 10, 2025 7:37 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…