వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న కాకాణి పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా ఈ కేసులో పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇప్పటికే 10 రోజుల పాటుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా… కనీసం నోటీసులు కూడా తీసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్న కాకాణిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ కేసునే కొట్టివేయాలంటూ కాకాణి దాఖలు చేసిన మరో పిటిషన్ పై విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. వెరసి ఈ కేసులో కాకాణి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లా పొదలకూరు పరిధిలో క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా దానిని తరలించి ఏకంగా రూ.250 కోట్ల మేర అక్రమార్జనను కూడబెట్టారంటూ కాకాణి, ఆయన అనుచరులపై పొదలకూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కాకాణి అనుచరుల్లో ముగ్గురికి ఇదివరకే కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న కాకాణితో పాటు మరికొందరికి విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ జాబితాలో కాకాణి అల్లుడు కూడా ఉన్నారు. కాకాణి మాదిరే ఆయన అల్లుడు కూడా పోలీసుల విచారణకు డుమ్మా కొట్టేశారు. దీంతో కాకాణితో పాటు ఆయన అల్లుడిని కూడా అరెస్టు చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు.
కోర్టులో ఎలాగూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశానని, తప్పనిసరిగా తనకు కోర్టు బెయిల్ ఇస్తుందన్న నమ్మకంతో పోలీసుల విచారణకు కాకాణి డుమ్మా కొడుతున్నట్లుగా సమాచారం. అయితే బుధవారం కోర్టు ఈ బెయిల్ పిటిషన్ ను కొట్టేయడంతో కాకాణికి షాక్ తగిలినట్టైంది. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కాకాణికి కాపాడుకునే దిశగా వైసీపీ కూడా ఆయనకు న్యాయపరమైన సహాయాన్ని అందిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైకోర్టు కాకాణి బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన తరుణంలో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం, అయితే అప్పటిదాకా పోలీసులు ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కనీసం నోటీసులు తీసుకోవడంలోనే తమను ముప్పు తిప్పలు పెట్టిన కాకాణికి మరింత సమయం ఇచ్చేది లేదన్న దిశగా పోలీసులు సాగుతున్నారు. వెరసి కాకాణి అరెస్టు తప్పదా అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on April 9, 2025 5:23 pm
వాస్తవానికి ఈ వారం విడుదల కావల్సిన సినిమా సారంగపాణి జాతకం. ఆ మేరకు ముందు ప్రకటన ఇచ్చింది కూడా ఈ…
సోషల్ మీడియా ప్రపంచంలో కోట్లాది మంది మునిగి తేలుతూ ఉంటారు. సీరియస్ గా కెరీర్ కోసం వాడుకునే వాళ్ళు కొందరైతే…
మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…