జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం అత్యంత దారుణంగా గడిచిందని చెప్పక తప్పదు. ఓ వైపు పెద్ద కుమారుడి జన్మదినం… అదే రోజు తెల్లారి లేవగానే.. అగ్ని ప్రమాదంలో చిన్న కుమారుడికి గాయాలు… అది కూడా ఎక్కడో సుదూరాన సింగపూర్ లో ఈ ఘటన జరగడం.. నిజంగానే పవన్ ఎలా ఉగ్గబట్టుకున్నారో తెలియదు గానీ.. సాధారణ వ్యక్తులు అయితే ఈ టెన్షన్ ను తట్టుకోవడం దుస్సాధ్యమే. మంగళవారం ఉదయం చిన్న కుమారుడికి ప్రమాదం జరిగితే… అతడిని పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం గానీ తన కళ్లతో చూడలేకపోయారు. బుధవారం ఉదయం పవన్ కుమారుడిని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు. మరో 3 రోజుల పాటు అతడికి ఆసుపత్రిలో చికిత్స జరగనున్నట్లు ప్రాథమిక సమాచారం.
మంగళవారం రాత్రి తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, వదిన సురేఖలతో కలిసి సింగపూర్ వెళ్లిన పవన్…బుధవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను చూశారు. ఎలాగూ భావోద్వేగాలను అణచుకోవడంలో ఓ రేంజి పరిణతి సాధించిన పవన్.. ఆసుపత్రి బెడ్ పై తన కుమారుడిని చూసి… ఒకింత సాంత్వన చెందారని చెప్పక తప్పదు. కాసేపు కుమారుడిని చూసుకున్న పవన్.. ఆ తర్వాత శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. అగ్ని ప్రమాదంలో శంకర్ కు చేతులు, కాళ్లకు గాయాలైన సంగతి తెలిసిందే. ఈ గాయాలు మానిపోయేటివే అయినా… ఊపిరితిత్తుల్లోకి వెళ్లినప పొగ వల్ల ఎదురయ్యే ఇబ్బందిపై పవన్ ఆందోళన చెందుతున్నారు.
మంగళవారం ఉదయం ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మార్క్ శంకర్ ను వైద్యులు ఐసీయూలోనే ఉంచారు. బుధవారం ఉదయం అతడిని సాధారణ గదికి తరలించారు. శంకర్ ఊపిరితిత్తుల్లోకి ఏ మేర పొగ చేరింది? దానిని తొలగించడం ఎలా? అందుకోసం అనుసరించాల్సిన వైద్య పద్ధుతులు ఏమిటి? పొగను తొలగించినా మార్క్ శంకర్ కు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కానున్నాయి? అన్న దానిపై వైద్యులు సమాలోచనలు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే శంకర్ కు బ్రాంకో స్కోపీ చేసిన వైద్యులు.. ఆ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యాహ్నానికి గానీ ఆ నివేదిక అందదని తెలుస్తోంది. ఈ నివేదిక అందిన తర్వాత తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏమిటన్న దానిపై వైద్యులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
This post was last modified on April 9, 2025 11:30 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…