అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బకు కుదేలైన ఆక్వా రంగానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భరోసాగా నిలిచారు. ట్రంప్ సుంకాల విధింపు నేపథ్యంలో ఆ సుంకాల ప్రభావం కారణంగా ఏపీ నుంచి విదేశాలకు రొయ్యల ఎగురమతులు బారీగా పడిపోయాయి. ఫలితంగా ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో ఆక్వా రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. అదే సమయంలో ట్రంప్ సుంకాల దెబ్బతో బెంబేలెత్తిపోయిన రొయ్యల ఎగుమతిదారులు… రైతుల నుంచి రొయ్యలను కొనుగోలు చేయడానికే ముందుకు రావడం లేదు. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేస్తున్నా అతి తక్కువ ధరలు ఇస్తున్నారన్న వాదనలు లేకపోలేదు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన రేకెత్తగా… పరిస్థితిని సమీక్షించి నష్ట నివారణ చర్యలు చేపట్టే దిశగా చంద్రబాబు సోమవారం ఓ కీలక సమావేశాన్ని నిర్వహించారు.
అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు, ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ఆయా శాఖల అదికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దీర్ఘకాలంలో స్థానిక వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని, ఫలితంగా విదేశీ మార్కెట్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. కష్టకాలంలో ఆక్వా రైతులను ఆదుకునే దిశగా వ్యాపారులు, ఎగుమతి దారులు సహకరించాలని కోరారు. అందుకోసం 100 కౌంట్ రోయ్యలను కిలోకు రూ.220కి తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆయన వ్యాపారులకు సూచించారు. ఈ ప్రతిపాదనకు వ్యాపారుల నుంచి సానుకూల స్పందన లభించింది. అదే సమయంలో వ్యాపారులు, ఎగుమతిదారులు పలు కీలక అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.
దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ లకు రొయ్యల ఎగుమతులపై దృష్టి సారించాలని వ్యాపారులు చంద్రబాబును కోరారు. ఈ దిశగా ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకుంటే… మంచి ఫలితాలు కూడా ఉంటాయని ఎగుమతి దారులు ఆయనకు తెలిపారు. దీంతో స్పందించిన చంద్రబాబు..కేంద్రంతో మాట్లాడి ఆయా దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాల దిశగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఆక్వా రంగంలో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ఎగుమతిదారులు, ఎంపెడా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు తదితరులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ ప్రస్తుత సంక్షోభాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వానికి సూచిస్తుందని ఆయన తెలిపారు.
This post was last modified on April 8, 2025 10:24 am
ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమా పరిశ్రమకు కూడా…
ఏప్రిల్ 27, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి(టీఆర్ ఎస్) 25 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోరుగల్లు.. ఓరుగల్లు వేదికగా..…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్ ప్రస్తుతం కేరళలో నాన్…
తమిళ స్టార్ హీరో సూర్యకు ఎంతో కీలకమైన సినిమా.. రెట్రో. కొన్నేళ్లుగా అతడికి విజయాలు లేవు. తన చివరి చిత్రం…
ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా పద్దెనిమిది వందల కోట్ల వసూళ్లతో ఆల్ టైం రికార్డులు సృష్టించిన పుష్ప 2…
ఏపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది కదా. మంగళవారం రాత్రి ఈ…