Political News

సీతమ్మవారి మెడలో తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే

ఓ ప్రజా ప్రతినిధి అన్నాక ఎలా ఉండాలి? అది కూడా ఓ శాసన సభ్యుడిగా కొనసాగుతున్న నేత ఎంత జాగ్రత్తగా ఉండాలి? 15 ఏళ్లుగా అయ్యప్పమాల వేస్తున్న భక్తుడికి ఆ మాత్రం సంప్రదాయాలు తెలియవా? ఏళ్ల తరబడి రాములోరి కల్యాణాన్ని వీక్షిస్తున్న భక్తుడికి సీతమ్మ మెడలో తాళి ఎవరు కడతారో కూడా తెలియదా?.. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వైసీపీ నేత బూసినే విరూపాక్షి వ్యవహారాన్ని చూస్తుంటే… ఇవే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఓ ఎమ్మెల్యేగా ఉండి.. అయ్యప్ప భక్తుడిని అని చెప్పుకుంటున్న విరూపాక్షి అత్యుత్సాహం ప్రదర్శించి ఆపై బేషరతుగా సారీ చెప్పిన వైనం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

అసలు విషమంలోకి వెళితే.. శ్రీరామనవమి సందర్భంగా విరూపాక్షి స్వగ్రామం చిప్పగిరిలోని కొండావీధిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి రాములోరి కల్యాణం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే హోదాలో విరూపాక్షి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా విరూపాక్షి చేతికి వేద పండితులు మంగళసూత్రాన్ని ఇవ్వగా… ఆయన దానిని సీతమ్మ మెడలో కట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి వైరల్ గా మారిపోయింది. సీతమ్మ మెడలో వేద పండితులు కట్టాల్సిన తాళిని విరూపాక్షి ఎలా కడతారంటూ పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

సోషల్ మీడియాలో తన వీడియో వైరల్ అవుతున్న విషయం, దానిపై హిందూ సంఘాలు చేస్తున్న ఆగ్రహావేశాల గురించి తెలుసుకున్న విరూపాక్షి…క్షణాల్లోనే తాను చేసిన తప్పును తెలుసుకున్నారు. వెంటనే సారీ చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. తన వల్ల పొరపాటు జరిగిందని, ఈ పొరపాటుకు చింతిస్తున్నానని, ఈ ఘటన ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని ఆ వీడియోలో విరూపాక్షి చెప్పుకొచ్చారు. అయినా తాను కావాలని ఈ పని చేయలేదని, తన చేతికి మంగళసూత్రం ఇచ్చిన వేద పండితుడు చెబితేనే.. దానిని సీతమ్మ మెడలో కట్టానంటూ ఆయన చెప్పారు. మొత్తంగా అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్కైన విరూపాక్షి… ఆలస్యం చేయకుండా సారీ చెప్పి తప్పించుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on April 8, 2025 10:59 am

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

47 minutes ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

1 hour ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

3 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

4 hours ago